29.1 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఘాట్‌ రోడ్డులో బస్సుకు బ్రేకులు ఫెయిల్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెళ్లి బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉ్నారు. కాకినాడ జిల్లాలో జరిగిందీ సంఘటన.

కాకినాడ జిల్లా సత్యగిరి నుంచి పెళ్లి బృందం సోమవారం ఉదయం రాజమహేంద్రవరానికి బయలు దేరింది. 40 మంది పెళ్లి సంబంధీకులు బస్సులో ప్రయాణిస్తు్నారు. అయితే, అన్నవరం ఘాట్‌ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి.

ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఈ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. బస్సు డ్రైవర్‌ గాభరా పడకుండా.. అప్రమత్తంగా వ్యవహరించాడు. ప్రమాదం జరగకుండా అదుపు చేసేందుకు డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ క్రమంలో డివైడర్‌తో పాటు.. పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని కూడా బస్సు ఢీ కొంది. ఆందోళన చెందిన పెళ్లి బృందం బస్సు నుంచి కిందికి దిగిపోయారు. ప్రమాదంలో అంతా సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బస్సుకు రిపేర్‌ చేయించి కల్యాణ మంటపానికి బయలుదేరి వెళ్లారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com