25.7 C
Hyderabad
Saturday, June 13, 2026

Live Video

spot_img

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్

అంతా భయపడినట్టే జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా పేస్ అటాక్‌ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఫైనల్ టీమ్ లిస్ట్‌లో బుమ్రా పేరు లేకుండా పోయింది. వెన్ను నొప్పి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బుమ్రాను టీమ్‌ నుంచి తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు.

నిజానికి ఇది టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. చాలా మంది స్పెషలిస్ట్‌ బౌలర్లు ఉన్నప్పటికీ బుమ్రాతో వారిని కంపేర్ చేయలేం. రన్స్ ఇవ్వకుండా వికెట్లు తీయడం బుమ్రా ఆర్ట్. అది అతని సొంతం. కానీ ఇప్పుడా స్పెషలిస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవ్వడం టీమిండియా ఫ్యాన్స్‌కు గట్టి షాకే అని చెప్పాలి.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్‌లో బుమ్రా గాయపడ్డాడు. వెన్నునొప్పి కారణంగా ఆఖరి మ్యాచ్‌ ముగియకముందే గ్రౌండ్‌ను వీడాడు. ఆ తర్వాత అనేక టెస్ట్‌లు, చికిత్స తర్వాత కూడా బుమ్రా పూర్తిగా కోలుకోలేదు. ఫిట్‌నెస్‌ విషయంలో చాలా పక్కగా ఉండే బీసీసీఐ అతడు పూర్తిగా కోలుకుంటేనే ఆడతాడు.. లేదంటే లేదని ముందే చెప్పింది. కానీ అతను కోలుకుంటాడన్న నమ్మకంతో ముందుగా అతని పేరును కూడా చేర్చింది. కానీ దురదృష్టవశాత్తు ఫిట్‌ నెస్ సాధించడంలో బుమ్రా ఫెయిల్ అయ్యాడు.

నిజానికి గాయం నుంచి బుమ్రా కోలుకున్నాడు కానీ.. పూర్తి స్థాయిలో అతని బౌలింగ్ సామర్థ్యం తిరిగి రాలేదని నివేదిక ఇచ్చారు NCA అధికారులు. దీంతో సెలెక్టర్లకే ఫైనల్ డెసిషన్‌ తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో అతని కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొని.. ట్రోఫీ నుంచి దూరంగా ఉంచారు.

మరి బుమ్రా స్థానంలో ఎవరు?
బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు రాణా. ఇప్పటికే అవకాశం దొరికిన ప్రతిసారీ దుమ్ము దులిపేస్తున్నాడు రాణా. మరి ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడనేది చూడాలి.

ఫైనల్ టీమ్
రోహిత్‌శర్మ(కెప్టెన్‌), గిల్‌(వైస్‌ కెప్టెన్‌), కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌(కీపర్‌), పంత్‌(కీపర్‌), శ్రేయస్ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్, హర్షిత్‌ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com