25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

నేను లీడర్ని… ఎస్ నేను ఐటీ ఎంప్లాయ్ ని!

1. రేవంత్ వర్సెస్ కేటీఆర్.
2. కేటీఆర్ ఒక ఐటీ ఉద్యోగి మాత్రమే నేను లీడర్ని రేవంత్ రెడ్డి.
3. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.
4. అవును నేను ఐటీ ఎంప్లాయి ని గర్వపడుతున్న..కేటీఆర్

తెలంగాణలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతుంది… ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరొకరు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్కడ అవకాశం ఉన్నా ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు కౌంటర్ చేసుకోవడానికి వెనకాడడం లేదు… అసెంబ్లీ నుంచి మొదలుకొని సోషల్ మీడియా వరకు ఎక్కడ అవకాశం దొరికిన ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తమదైన శైలిలో కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు..
తాజాగా దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. కేటీఆర్ ఒక ఐటీ ఎంప్లాయ్ అని… అతను ఒక ఉద్యోగిగా మాత్రమే ఆలోచిస్తాడని తాను ఒక లీడర్ అని.. ఎలా పని చేయించుకోవాలో ఎలా చేయాలో తనకు తెలుసునని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరోక్షంగా తనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని కేటీఆర్ కి ఎలాంటివి లేవని వచ్చే విధంగా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తనదైన శైలిలోనే స్పందించారు..
నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను,
ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్ళకు, అన్నాదమ్ముళ్ళకు సలాం.. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి.

మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్ళు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం.
నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికి గర్వకారణం అంటూ అయిన కామెంట్ చేశారు… మొత్తానికి ఇద్దరు నాయకులు తమ వాదనను బలంగానే చెప్పుకున్నట్టుగా స్పష్టమవుతుంది…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com