రేవంత్ రెడ్డికి తాను అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, కావాల్సినంత దోపీడి జరుగుతోందని, ఇంకా ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడో అర్థం కావటం లేదని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో కెటిఆర్…వివిధ ఆంశాల్ని ప్రస్తావించారు.
నిన్న సిఎం మాట్లాడిన మాటలు విన్న తర్వాత చిట్టినాయుడు చిప్ దొబ్బినట్లు అనిపించిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. మేము అదానీకి ప్రాజెక్ట్ లు ఇచ్చామంటాడు. ఎంపీగా కూడా పనిచేసిన ఈయన జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లు మేము ఇచ్చామంటాడని విమర్శించారు.
కేటీఆర్ ప్రెస్ మీట్ లో ముఖ్యంశాలు
రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించింది. రక్షణ శాఖ కు ఇచ్చిన ప్రాజెక్ట్ లు మేము ఇచ్చామంటాడు. రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా? మరీ రాజ్ నాథ్ సింగ్ ఏం చేస్తున్నట్లు? విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. ఇంత తెలివి తక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలి.
ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్దాలను మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలి. డ్రైపోర్ట్ కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము ఎవ్వరికీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్లు చూపించారు.
చిట్టి నాయుడుకు ఏమీ తెలియదు. ఎవరన్ని చెప్పిన వినడు. ఆయన మూర్ఖుడు. మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు….రెండో సారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడు. మైక్రో సాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేశాడు.
నీకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుంది. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయ్యావ్. మైక్రో సాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చింది. ఆమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొచ్చాం.
నేను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్ లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్ లో పెట్టాను. నీలాగా ఇంటికి పిలిపించుకోని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు, కోహినూరు హోటల్ లో కాళ్లు పట్టుకోలేదు. నాకు నీ లాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదు. ఏదీ చేసిన బజాప్తా చేస్తా. అదానీ సంస్థలను మేము అసలు ఎంకరేజే చేయలేదు.
నీ లెక్క లుచ్చా పనులు చేసి..ఆయన కాళ్లు ఒత్తుకుంటా ఉండే అలవాటు నాది కాదు. ఫస్ట్రేషన్ లో నన్ను తిడున్నావ్ సరే నాకు ఏమీ ఫరక్ పడది. ప్రశ్నిస్తే నేను సైకోనా? కొండారెడ్డి పల్లిలో నీకోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరీ నువ్వు శాడిస్ట్ వా? అసలు నీకోసం పనిచేసిన పెద్ద మనిషి ఆత్మహత్య కు కారణమైన నువ్వు మనిషివేనా?
శైలజ అనే విద్యార్థి చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు మా పార్టీ నేత కోవా లక్ష్మి వెళ్తా ఉంటే ఆమె హౌజ్ అరెస్ట్ చేశారు. అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్ లాంటి నేతలను కూడా అరెస్ట్ చేశారు. వాళ్లు పోతే నీకు ఏమైందయ్యా. ఇంటర్ నెట్ షట్ డౌన్, అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు ఇదే ప్రజా పాలనా?
ఏడాది నీ పాలనలో అదానీ, అల్లుడు, అన్న, బావ మరది సృజన్ రెడ్డికి అమృతం పంచటం కోసం తప్పా….నువ్వు పీకిందేంటీ? అసలు అదానీ చెక్ ఇచ్చి 38 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు క్యాష్ చేయలేదు. అంటే చెక్ చూపించి వెనక నుంచి ఆ డబ్బులు దొబ్బేసే కుట్ర చేస్తున్నారు. అదానీ ఫ్రాడ్ అని రేవంత్ రెడ్డికి నిన్ననే తెలిసిందా?
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్రలో గజదొంగ ఇక్కడ సుద్దపూస అయ్యిండా? ఆయన చెక్ ఇవ్వలేదు. అది క్యాష్ కాలేదు. ఏదో తమాషా చేసిండు. అదానీతో రూ. 12,440 కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. అందులో పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంట. అసలు తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ పాలసీ ఉందా?
ముఖ్యమంత్రి చెప్పిన వాటిల్లోనే రెండు అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ పాలసీ లేదు. అదే విధంగా కొడంగల్ లో అల్లుడు కోసం అనుకున్నాం. కానీ ఇప్పుడు అదానీ కోసం తెలిసింది. రామన్న పేటలో సిమెంట్ ప్రజలు వద్దన్నప్పటికీ పెడుతూ మూసీని కలుషితం చేస్తారంట. మళ్లీ కొడంగల్ లో కూడా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతారంట.
నేను ప్రశ్నిస్తే సైకోనా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెడితే మరి నువ్వు దొంగవా? అదానీ రాష్ట్రం వదిలి వెళ్లాడు అని సీఎం అనుంగ పేపర్లోనే వార్త వచ్చింది. ఏదో నిన్న రాహుల్ గాంధీ ఫోన్ చేసి తిట్లు తిట్టటంతో అట్ల యాక్షన్ చేశారు. అదానీ వ్యవహారానికి సంబంధించి రెండేళ్ల కిందటే హిండెన్ బర్గ్ రిపోర్ట్ వచ్చింది.
రాహుల్ గాంధీ ఏమో అదానీ దొంగ అని అంటుంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో రూ. 12, 400 కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడు. ముఖ్యమంత్రి ఇంటి పేరును అనుముల కాదు…అబద్దాలు రేవంత్ అని మార్చుకోవాలి. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్ట్ లను మేము ఇచ్చామంటూ చెబుతున్నావ్ నీకు ఏమైనా పరిజ్ఞానం ఉందా?
బీఆర్ఎస్ దెబ్బకు గత్యంతరం లేక ఫీచేముడ్ అన్నందుకు సంతోషం. అదానీతో మొత్తం ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిన్ను, నీ రాహుల్ గాంధీని ప్రజలు నమ్ముతారు. మూసీ ప్రాజెక్ట్ ను ఏ పాలసీ లేకుండా ఏ విధంగా ఇస్తారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివి. ఏం చేస్తావో చేసుకో. నీకు భయపడేవాళ్ల కాదు మేము.
రేవంత్ రెడ్డి రెడ్ రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే మంచిదే. 28 సార్లు ఢిల్లీకి పోయి రూ. 28 కూడా తేలేదు. నువ్వు పెద్ద బృందంతో వెళ్లి పెట్టిన ఖర్చు కూడా పడ్తల పడుతలేదు ఎట్లా? బీజేపీతో చీకటి ఒప్పందం, రాహుల్ గాంధీని కలిసి ఆయనకు మూటలు ఇచ్చి కుర్చీ కాపాడుకోవటానికే నువ్వు ఢిల్లీకి వెళ్లేది. అంతే తప్ప ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీకి పోతలేడు.