29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

పర్యాటక ప్రాజెక్టుకు సహకారం అందించండి

కేంద్ర మంత్రి షెకావత్ ని కోరిన డీసీయం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మంగళవారం కేంద్ర మత్రి షెకావత్ ని కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులను అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీయం కేంద్ర మంత్రికి వివరించారు. ఏపీకి 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి షెకావత్ కి తెలిపారు. గండికోట వంటి చారిత్రక వారసత్వం  ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చెయ్యడంతో పాటు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com