29.1 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

మిర్చి దండలు వేసుకుని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసన

కౌన్సిల్ ఆవరణలో భారత రాష్ట్ర సమితికి చెదిన శాసనమండలి సభ్యులు వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోమవారం మండలి ప్రారంభానికి ముందు బీఆర్‌ఎస్‌ శాసనమండలి సభ్యులు మొడలో మిర్చి దండలు వేసుకుని నిరసన తెలియజేశారు. మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల జాబితా నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు. మిర్చి రైతులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని, 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ నిరసనను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం లో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి  నాఫెడ్, మార్క్ ఫెడ్ల ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్ కు ఇరవై ఐదు వేల రూపాయలు నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఈసందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో పండించే మిర్చి పంటలను విదేశాలకు ఎగుమతి చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com