37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

శాసన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శాసనసభలో, ఎమ్మెల్సీలు శాసనమండలిలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా నల్ల రంగు దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా శాసనమండలి సభ్యులు కూడా మండలిలో నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

అంతకుముందు పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టుపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశాలపై సభలో చర్చించడానికి అనుమతించాలంటూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాయిదా తీర్మానం అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com