రైతు భరోసాను ఎత్తగొట్టే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ప్రమాణ పత్రాల పేరుతో రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
రైతులను భయాందోళనకు గురి చేసే కుట్ర చేస్తోందని, రైతన్నలను దొంగలుగా చిత్రీకరించి ప్రయత్నం మానుకోండని కెటిఆర్ హితవు పలికారు. రాష్ట్ర ప్రజల సొమ్మును రైతన్నలు మాత్రమే తింటున్నారన్న దుష్ప్రచారం ఆపాలని కోరారు.
కెటిఆర్ కామెంట్స్…
హామీలు అమలు చేసే సత్తా లేకుంటే రైతన్నలకు క్షమాపణ అడగండి. అసలు ఈ ప్రభుత్వానికి రైతన్నల నుంచి ప్రమాణపత్రాలు అడగడానికి సిగ్గు ఉండాలి. ప్రమాణ పత్రం వేయాల్సిందే రైతన్నలు కాదు రైతన్నలకు హామీ ఇచ్చి మోసం చేసింది ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రైతన్నలకు ఇచ్చిన రైతు భరోసా పైన గ్రామ గ్రామాన లబ్ధిదారుల జాబితా పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో కౌలు రైతులకు రైతు కూలీలకు ఏ విధంగా రైతుబంధు ఇస్తుందో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
మరొక్కసారి రైతు భరోసాకు దరఖాస్తు చేయాలి అంటూ డ్రామా మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ ప్రజాపాలన – అభయ హస్తం పేరుతోనే… ప్రజలందరి నుంచి దరఖాస్తులు తీసుకుంది. 6 గ్యారంటీల కోసం అని చెప్పి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి కోటి ఆరు లక్షల మంది దగ్గర దరఖాస్తులు తీసుకుంది. ప్రజలందరి సమాచారాన్ని సంపూర్ణంగా తీసుకుంది.
ప్రతి దానికి దరఖాస్తుల పేరు చెప్పి కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది. గతంలో రైతును శాసించేటట్టు మా ప్రభుత్వం తయారు చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం యాచించే స్థితికి తీసుకువచ్చింది. మేము రైతును రాజుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లుగా తయారుచేస్తుంది.
ప్రభుత్వానికి రైతన్నల నుంచి ప్రమాణపత్రాలు అడగడానికి సిగ్గు ఉండాలి. ప్రమాణ పత్రం వేయాల్సింది రైతన్నలు కాదు రైతన్నలకు హామీ ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రైతన్నలకు ఇచ్చిన రైతు భరోసా పైన గ్రామ గ్రామాన లబ్ధిదారుల జాబితా పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో కౌలు రైతులకు రైతు కూలీలకు ఏ విధంగా రైతుబంధు ఇస్తుందో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
ఇప్పుటి దాకా రైతుల నుంచి కొన్న పంట కొనుగోలు వివరాలు, ఇచ్చిన బోనస్ వివరాల జాబితా గ్రామంలో పెట్టాలి. రైతుబంధు పథకాన్ని మా ప్రభుత్వం తీసుకువస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బొంద పెట్టడానికి కుట్ర చేస్తుంది. అందుకే రైతు బంధులో 22000 కోట్లు పక్కదారి మల్లినాయని దుష్ప్రచారం చేస్తుంది. ఏ ఊర్లో ఎంత మేర రైతుబంధు దుర్వినియోగం అయిందో గ్రామ గ్రామాన జాబితా ప్రచురించాలి.
పత్తి రైతుకి, కంది రైతుకి, చెరుకు, పసుపు, మరియు పోడు భూముల రైతన్నల కు ఇచ్చిన రైతుబంధును దుబారా అయిందని అడ్డగోలుగా ప్రభుత్వం అబద్ధాలు ఆడుతున్నది. మరి ఈ రైతన్నలందరికీ ప్రమాణ పత్రాల పేరుతోనే రైతు భరోసా ఎగ్గొడతారా. రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తూ రద్దు చేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది.
ప్రతి ఒక్క రైతన్న ప్రభుత్వానికి ఎందుకు ప్రమాణ మాత్రం ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇప్పటికే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల విషయాన్ని గుర్తు చేయాలి. గతంలో 12 సార్లు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం వద్ద అన్ని రకాల సమాచారం ఉన్నదన్న విషయాన్ని ప్రజలు ప్రభుత్వానికి చెప్పాలి. ధరఖాస్తుల పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో రైతుకి ఒక్కొక్క ఎకరానికి 17500 వేల రూపాయల చొప్పున మొత్తం రాష్ట్ర రైతులకు 26 వేల కోట్ల రూపాయలకి పైగా బాకీ పడింది.
ప్రభుత్వానికి దమ్ముంటే జిల్లాల వారీగా దుబార ఐనా రైతుబంధు నిధులను బయటపెట్టాలి. దీంతోపాటు గ్రామ గ్రామాన.. గ్రామ పంచాయతీల వద్దనో రైతు వేదికల వద్దనో పెట్టాలి. రైతుబంధు దుర్వినియోగం చేసిన రైతుల పేర్లతో కూడా పెట్టండి … అప్పుడు తెలుస్తది నిజంగానే కాంగ్రెస్ చెప్పింది అబద్ధమా నిజమా అని. కేవలం రైతులను ప్రజల ముందు పలుచన చేసే కుట్ర చేస్తుంది.
రాష్ట్ర ప్రజల సొమ్మంతా రాష్ట్ర రైతాంగం తింటున్నట్టు దుష్ప్రచారం చేస్తుంది. రుణమాఫీ గురించి అడిగితే, రైతు భరోసా గురించి అడిగితే రైతులను బిచ్చగాళ్ళని రాష్ట్ర మంత్రులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి దరఖాస్తులు తీసుకోవడం మానాలి.
వరంగల్ రైతు డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేద్దాం. రాష్ట్రంలోని 22 లక్షల కౌలు రైతాంగానికి రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు. రైతుబందును రైతు భరోసాను కుదించే కుట్రను మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. రేపటి నుంచి పలు రకాల కార్యక్రమాల రూపంలో రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యవంతం చేద్దాం.
సంక్రాంతి లోగా రైతు భరోసాను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువద్దాం. రైతుకి పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో కేసీఆర్ ఒక్కరే. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఎలాంటి దరఖాస్తులు చేయకుండా రైతన్నకు రైతుబంధు అందించాం. 11 సీజన్లలో 73 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతల్లోకి వేసాము. 12వ సీజన్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఎన్నికల కమిషన్ కి ఉత్తరం రాసి ఆపింది కాంగ్రెస్.
సంవత్సరం దాటిపోయిన ఈరోజు వరకి ఒక్క రూపాయి కూడా రైతు భరోసా రూపంలో రైతన్నలకు ఇయ్యలేదు. ఆరోజు మేము దాచిపెట్టిన 7500 కోట్లు మాత్రమే రైతు భరోసా పేరుతో ఇచ్చారు. ఎన్నికలకు ముందు వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి రైతన్నలను ఉద్ధరిస్తామని ప్రగల్బాలు పలికారు. రైతు డిక్లరేషన్ లో భాగంగా ఎకరంకి పదిహేను వేలు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా ఇస్తామని ప్రకటించింది. వ్యవసాయ రంగానికి అనేక హామీలు ఇచ్చారు. ఎన్నో రకాల హామీ ఇచ్చిన ప్రభుత్వం… ఇప్పుడు రైతులతోనే ప్రమాణ పత్రాలు తీసుకుంటుంది.