ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో నిర్వహించాలని అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక విషయం వివాదంగానో లేదా సంచనలంగానో జరుగుతోంది. లెటెస్ట్‌గా ప్రతి ఐసీసీ టోర్నీ నిర్వహించే ముందు జరిగే కెప్టెన్స్ సమావేశం రద్దైంది. దీన్ని రద్దు చేసింది కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డే కావడం విశేషం. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది. అయితే పాకిస్థాన్, దుబాయి వేదికగా జరుగుతుంది ఈ టోర్నీ. ఓపెనింగ్ సెర్మనీకి ముందు కెప్టెన్లంతా కలిసి ఫోటోలకు ఫోజులిస్తారు. ఇప్పటి వరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళతాడా? లేదా? అనే డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడా కష్టం మీకేందుకు అన్నట్టుగా మొత్తం ఈవెంట్‌నే రద్దు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.
అయితే దీనికి రీజన్ బీసీసీఐ మాత్రం అస్సలు కాదు. మిగతా టీమ్ కెప్టెన్స్ పాకిస్థాన్‌కు చేరుకునేందుకు సమయం పడుతుండటంతో షెడ్యూలింగ్ సమస్య కారణంగా ఈ ఈవెంట్‌ను రద్దు చేసినట్టు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుంది. అయితే ఫిబ్రవరి 18న ఇంగ్లండ్ టీమ్ పాక్‌లో ల్యాండ్ కానుంది. ఆ తర్వాతి రోజు అంటే 19న ఆస్ట్రేలియా టీమ్ చేరుకుంటుంది. మ్యాచ్ నిర్వహణ, ఫోటో షూట్ రెండు కుదరవు కాబట్టి పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికీ ఓ ప్రశ్నకు మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. ఫిబ్రవరి 16న లాహోర్‌లో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. మరి రోహిత్ ఈ ఈవెంట్‌కు హాజరవుతాడా? లేదా? అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. బీసీసీఐ, పీసీబీ, ఐసీసీ ఇంత వరకు ఈవ్యవహారంపై స్పందించలేదు.