బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో అత్యంత కీలకమైన నాలుగో టెస్ట్‌కు ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 26 నుంచి జరగనున్న ఈ టెస్ట్‌లో గెలుపు కోసం నెట్స్‌లో చెమటోడుస్తున్నాయి ఇరు టీమ్స్. మ్యాచ్‌కు ముందు మీడియాతో ముచ్చటించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న రోహిత్.. మ్యాచ్ ఆడేందుకు ఫుల్ ఫిట్‌గా ఉన్నాడని అనౌన్స్ చేశాడు హిట్ మ్యాన్. దీంతో రోహిత్ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే డౌట్స్‌కు ఎండ్ కార్డ్ వేసినట్టైంది. అయితే ఏ స్థానంలో వస్తాడన్నది మాత్రం మిస్టరీగానే ఉంచాడు రోహిత్.
విరాట్ బ్యాటింగ్.. ఆఫ్ స్టంప్ ఇష్యూస్‌పై కూడా స్పందించాడు రోహిత్. విరాట్‌కు అలాంటి ఇష్యూ ఏమీ లేదని.. తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకునే సత్తా తనకుందని.. ఎవరి సలహాలు, సూచనలు తనకు అవసరం లేదని మీకు తెలుసు కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్.
ఇక టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెట్స్‌లో గాయపడ్డ హెడ్ కోలుకొని మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండటం. రోహిత్ లాగానే హెడ్ కూడా నెట్ ప్రాక్టీస్‌లో గాయపడ్డాడు. అయితే అతను కూడా మ్యాచ్ ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. టీమ్ ఇండియా బౌలర్లపై పూనకం వచ్చినవాడిగా రెచ్చిపోతున్నాడు హెడ్. దీంతో మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌కు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.