హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ కు చెందిన యామీ గౌతమ్ 1988లో జన్మించింది. కన్నడ నాట మొదటి సినిమా చేసి 2011లో తెలుగులో నువ్విలా సినిమాతో ఎంటర్ అయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విలన్ గా నటించాడు. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉన్న యామీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో సందడి చేస్తోంది.ఫెర్ అండ్ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా పాపుల్ అయిన యామి గౌతమ్ హిందీతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
హిందీలో విక్కి డోనర్ సినిమాతో యామీ గౌతమ్ కు మంచి పాపులారిటీ వచ్చింది. వీర్య దానం కథాంశంగా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తెలుగుతోపాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించినా హిట్స్ అందుకోలేకపోయింది. ‘ఉరి’ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తో ప్రేమాయణం సాగించిన యామీ.. 2021లో ఆయననే పెళ్లి చేసుకుంది.
యామీ గౌతమ్ కు 2024లో కుమారుడు జన్మించాడు. కుమారుని పేరు వేదవిద్. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే.. పెండ్లి తర్వాత కూడా కెరీర్‌లో దూసుకుపోవచ్చని నిరూపిస్తోంది అందాల తార యామి గౌతమ్.
పెండ్లి తర్వాత హీరోయిన్ కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటే పొరపాటని, కెరీర్‌కు పెళ్లి అడ్డు కాదని చాలా మంది హీరోయిన్లు నిరూపించారు. అదే కోవకు చెందిన యామీ గౌతమ్ పెళ్లి తర్వాత హిట్లు కొడుతోంది.
తెలుగులో నటించినది నాలుగు చిత్రాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకులు తనను బాగా ఆదరించారని చెప్పుకొచ్చింది యామి. మంచి అవకాశం వస్తే తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తానని మనసులో మాట బయటపెట్టిందీ బ్యూటీ.
యామీ గౌతమ్ నటించిన యూరి హిందీ సినిమా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.
యామి గౌతమ్ జంతు ప్రేమికురాలిగా మూగ జీవాల రక్షణ కోసం తన వంతు కృషి చేసింది. త్వరలో హిందీ సినిమా ధూమ్ ధామ్ వస్తుండగా అంతకు ముందు వివిధ వెబ్ సీరీస్ లలో లీడ్ రోల్స్ చేసింది.
photo courtesy: instagram