23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

మహిళలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలపై ఏపీ సర్కారు దృష్టి

ఏపీలో కూటమి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఉద్యోగాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా మహిళలకు ఇంటి నుంచే పని చేయడం చాలా సౌలభ్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో ఉండే పని చేయడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ఎక్స్‌ వేదికగా చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ‘అంతర్జాతీయ మహిళలు, బాలికల సైన్స్‌ దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇంటి నుంచి పని చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు అందించడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందని చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాలలో మహిళలకు సమానమైన అవకాశాలు స్పష్టించడానికి తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్క్‌ కల్చర్‌లోకి మహిళలను భారీగా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అందుకే.. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున వర్క్‌ఫ్రమ్‌ హోమ్ కల్చర్‌ డెవలప్ చేయడానికి చర్యలు చేపట్టబోతున్నట్టు చంద్రబాబు వివరించారు. పనితనాన్ని సులభంగా తెలియజేసేందుకు అవసరమైన సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌కు ప్రాధాన్యత కూడా పెరిగిందని వెల్లడించారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లు వంటి భావనలు విస్తృతమవుతున్నాయని తెలిపారు. అవి వ్యాపారాలను, ఉద్యోగాలను సులభతరం చేస్తున్నాయని అన్నారు.

ముఖ్యంగా మహిళల సౌలభ్యం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం చెప్పారు. రిమోట్ వర్కింగ్, కో- వర్కింగ్ స్పేస్ వల్ల ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఇవి కంపెనీలకు, ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు మంచి ఫలితాలు అందిస్తాయని ఆయన తెలిపారు. మెరుగైన పని చేయడంతో పాటు మంచి ఔట్ పుట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని.. కాబట్టి వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఉద్యోగాలు మహిళలకు ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యవసర సర్వీసులైన రెవెన్యూ , పోలీసు, హాస్పిటల్, టీచర్లు విభాగాలు తప్పించి మిగిలిన విభాగాల్లో ఆఫీసుకు వచ్చే అవసరం ఉండదని, ఇలాంటి ఉద్యోగాలకు ఇంటి నుంచే పని కల్పించే యోచనలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. మహిళలు ఆఫీస్‌లో ఉద్యోగం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆప్షన్ కరెక్ట్‌గా ఉంటుందని సీఎం అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో మహిళ ఉద్యోగుల పాలిట అర్థవంతమైన మార్పుకు ఇది శ్రీకారం చుట్టబోతుందని సీఎం తెలిపారు. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ఒక గేమ్ ఛేంజింగ్ పాలసీ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏపీలో పత్రి నగరం, పట్టణం, మండలంలో సాఫ్ట్ వేర్ ఆఫీసులు పెట్టడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఉద్యోగం చేయడం ల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com