బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే హిందీ సినిమాల్లో అధికంగా నటించింది. ముంబైకి చెందిన బింద్రే మరాఠీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సోనాలి బింద్రే ప్రస్తుతం సినిమాల కన్నా మళ్లీ మోడలింగ్ లో రాణిస్తోంది. తన తాజా ఫోటోలను సోనాలి బింద్రే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగులో చిరంజీవి సరసన శంకర్ దాదా ఎంబిబిఎస్ లో నటించిన సోనాలి బింద్రే… మహేశ్ బాబుతో మురారి, నాగార్జునతో మన్మధుడు సినిమాలు చేసి పాపులర్ అయింది.
అమెరికాలో క్యాన్సర్ మహమ్మారికి చికిత్స తీసుకుంది. స్టేజ్ ఫోర్ లో బయటపడిన రాచపుండును ధైర్యంగా ఎదుర్కొంది. మనోస్థైర్యం క్యాన్సర్ చికిత్సలో ప్రధానమని సొనాలీ బింద్రే పలు సందర్భాలు ప్రకటించింది.
2021లో క్యాన్సర్ నుంచి కొలుకున్నాక తిరిగి మోడలింగ్ వైపు మరలింది. మోడలింగ్ తోపాటు అజీబ్ దస్తాన్ హై యే, ద బ్రోకెన్ న్యూస్ తదితర టెలివిజన్ ధారవాహికల్లో పనిచేస్తోంది.
ఆద్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే సొనాలీ బింద్రే అయోధ్యలో సీతారాముల దర్శనం చేసుకుని సరయు నది తీరంలో జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొంది.
2001లో నిర్మాత గోల్డీ బెహల్ ను వివాహం చేసుకున్న సొనాలీ బింద్రేకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అందం, అభినయంలో కుర్ర హీరోయిన్లకు తీసిపోని రీతిలో గ్లామర్ మెయింటేన్ చేస్తోంది సొనాలీ బింద్రే.