రైమా సేన్ సినీ పరిశ్రమలో పరిచయం అక్కరలేని నటి. హిందీ, బెంగాలి, మరాఠీ,మళయాలం, ఇంగ్లీషు సినిమాలతో పాటు తెలుగులో కూడా నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిషా కళ్ల రైమా…లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.రైమా సేన్ 1979 నవంబరు 7న ముంబైలో జన్మించింది. ఈమె అలనాటి ప్రముఖ నటి మున్ మున్ సేన్, భరత్ దేవ్ వర్మ.
తండ్రి భరత్ వర్మ త్రిపురలో ప్రముఖ రాజవంశానికి చెందిన వ్యక్తికాగా తండ్రి తరపున దేశంలోని ప్రముఖ రాజకుటుంబాలతో రైమా సేన్ కుటుంబానికి బంధుత్వాలు ఉన్నాయి.
గాడ్ మదర్ (1999) చిత్రంతో బాలనటిగా రైమా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె దామన్ చిత్రంలో రవీనా టాండన్ కుమార్తెగా నటించింది.
బెంగాలి సినిమా చోఖర్ బాలిలో హీరోయిన్ గా అద్భుతమైన పాత్ర పోషించింది. మరికొన్ని యావరేజ్ సినిమాల తర్వాత ఈ ముద్దుగుమ్మ 2005లో హింది సినిమా పరిణీతలో నటించింది.
బాలీవుడ్, బెంగాలి సినిమాల్లో బిజీగా ఉండే 45 ఏళ్ల ఈ ప్రౌడ సుందరి ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ఒడిషాకు చెందిన రాజకీయ నాయకుడు కలికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ తో 2006లో సహజీవనం చేసినా రెండేళ్లకే విడిపోయారు
కళ్లతోనే కవ్వించే రైమా సేన్ సోదరి రియా సేన్ కూడా చిత్రపరిశ్రమలోనే ఉంది. బాలీవుడ్, బెంగాలి సినిమాల్లో రియా సేన్ నటిస్తోంది.
తెలుగులో హీరో నితిన్ తో కలిసి ధైర్యం సినిమాలో నటించిన రైమా సేన్… ఆ తర్వాత టాలీవుడ్ వైపు మళ్లీ రాలేదు.
లవ్ బైట్స్(Zee5), కలంకో(Hoichoi), బిగ్ గర్ల్స్ డోంట్ క్రై(Amazon prime)తదితర వెబ్ సీరీసుల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.
బెంగాలి సినీ పరిశ్రమలో రైమా సేన్ టాప్ హీరోయిన్. నాలుగు పదులు దాటినా కథ ప్రధానంగా తీసే చిత్రాలతో కుర్ర హీరోయిన్లకు సవాలు విసురుతోంది.
courtesy: instagram