పాకిస్థాన్ క్రికెట్ తీరు చింత చచ్చినా.. పులుపు చావలేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆటలో పాతాళంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ ఇండియన్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మను తీవ్రంగా అవమానించింది. ఐపీఎల్ లాగానే పాకిస్థాన్ సూపర్ లీగ్ అని ఒకటి నిర్వహిస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఇందులో ముల్తాన్ సుల్తాన్ అనే ఓ టీమ్ ఉంది. ఈ టీమ్ లెటెస్ట్‌గా ఓ వీడిమోను రిలీజ్ చేసింది. PSL కప్‌ను పక్కన ఉంచి ఓ మస్కట్‌ను పెట్టి దానికి రోహిత్ శర్మ వాయిస్‌ను యాడ్ చేశారు.
నిజానికి ఇలా మస్కట్‌లను ఉపయోగించడం తప్పు కాదు. కానీ ఆ మస్కట్ బొద్దుగా ఉండటం.. దానికి రోహిత్ వాయిస్‌ను యాడ్ చేయడం చూస్తుంటే ఇదేదో కావాలనే చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి ఇటు భారత్‌లో, అటు పాకిస్థాన్‌లో కూడా ఆ టీమ్‌పై విరుచుకపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
అందులో రోహిత్ వాయిస్ వాడాల్సిన అవసరం ఏముంది? రోహిత్ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించాడు.. మీరేం చేశారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. సొంత లీగ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి కూడా రోహిత్ వాయిస్‌నే వాడుకోవాలా అనేది మరికొందరి వాదన. ఇలా రకరకాలుగా ప్రస్తుతం కామెంట్స్ వస్తున్నాయి.