24.5 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img
Home Blog Page 461

మూసీ పక్కన నిద్ర చేస్తున్నాం.. మేం పేదల పక్షం : కిషన్‌రెడ్డి

మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బుల్డోజర్‌తో తొక్కిస్తామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడొచ్చా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడానికి మాత్రం తాము వ్యతిరేకమన్నారు. పేదల ఇళ్లు కూల్చకుండానే మూసీ ప్రక్షాళన చేయవచ్ని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంది.. ప్రక్షాళనకు ఎంత ఖర్చవుతుందో రేవంత్‌ దగ్గర లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే తామే మొదటి తట్ట ఎత్తుతాం… మొదటి పార తీస్తామన్నారు. బస్తీలో ఉంటారా ? అని రేవంత్ సవాల్ చేశారు కదా.. రేపు మూసీ పక్కన నిద్ర చేస్తామన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వడానికే బీజేపీ నేతలు మూసీ పక్కన నిద్ర చేస్తున్నారని వివరణ ఇచ్చారు. రేవంత్‌ చెప్పినట్లు మూసీ పక్కన మూడు నెలలు ఉండటానికి నేను సిద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

బేగంపేట పర్యాటక భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పంటలకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులతో పాటు ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

గతంలో ఫాం హౌస్ వీడియోలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ ఎలా రాజకీయం చేసిందో… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిన విషయం కలెక్టర్ మీద దాడి వరకు ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు. అసలు తెలంగాణలో ఇలాంటి అంశాలు ఎక్కడికి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో కమిషనర్‌ను బదిలీ చేశారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో 21 నుంచి లోక్‌ మంథన్‌ : ప్రారంభించనున్న రాష్ట్రపతి

ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ , తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి 12 దేశాల నుంచి ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. లోక్ మంథన్ కార్యక్రమం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని కిషన్ రెడ్డి వివరించారు. ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటే కార్యక్రమం లోక్‌మంథన్‌ అని కిషన్‌రెడ్డి అన్నారు. ఇతర దేశాల నుండి కూడా ప్రతినిధులు పాల్గొన బోతున్నట్లు వెల్లడించారు. వందలాది కళాకారులు, విద్యా వేత్తలు, మేధావులు పాల్గొంటారని చెప్పారు. సముద్ర మథనం ఎలా జరిగిందో అలా ఈ లోక్ మంథన్ జరుగుతుందని తెలిపారు. వనవాసి, నగర వాసి, గ్రామ వాసి ఈ మూడు కలిస్తే నే దేశం అన్నారు. దురదృష్టవశాత్తూ ప్రజలను కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుందన్నారు. బిర్సా ముండా జయంతిని, గిరిజన గౌరవ దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని గుర్తు చేశారు. 21వ తేదీన స్టాల్స్ ఎగ్జిబిషన్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. 22వ తేదీన లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. లోక్‌మంథన్‌ కార్యక్రమానికి ఎంట్రీఫీజు ఉండదని, అన్ని వర్గాల వాళ్లు ఈ కార్యక్రమానికి రావాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

బాలకృష్ణ 109 వ సినిమా టైటిల్, టీజర్ విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ సినిమా టైటిల్ తో పాటు టీజర్ శుక్రవారం మూమీ టిమ్ రిలీజ్ చేసింది. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమాకు డాకూ మహరాజ్ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ ని ప్రకటిస్తూ 50 సెకన్ల నిడివి గల టీజర్ ను కూడా డాకూ మహారాజ్ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యానిమల్ సినిమా ఫేమ్ బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన సంగీత అందిస్తున్న ఈ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ వెళ్ళనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళతారు. శనివారం ఢిల్లీలో జరిగే హిందుస్ధాన్ టైమ్స్ కాంక్లేవ్ లో సీయం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే రేపు కేంద్ర ఆర్థికశాఖ మంత్తి నిర్మల సీతారామన్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులని కలసి రాష్ట్ర వ్యవహారాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబయ్ వెళతారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

దక్షిణ కొరియాలో తెలంగాణ శాసన బృందం

దక్షిణ కొరియా దేశ పర్యటనలో భాగంగా ఈరోజు(శుక్రవారం) భారత దేశ రాయబారి అమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.

ఈసందర్భంగా రాయబారి అమిత్ కుమార్ తెలంగాణ శాసన బృందంతో మాట్లాడుతూ తాను రెండు సార్లు హైదరాబాద్ సందర్శించానని హైదరాబాద్ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అన్నారు. భారతదేశంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని కితాబిచ్చారు.

దక్షిణ కొరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అవకాశాలు బాగున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి మంచి వాతావరణం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ శాసన బృందం ఈ సందర్భంగా కోరింది

ఆస్ట్రేలియా లోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం కామన్వెల్త్ దేశాల స్టడీ టూర్ లలో భాగంగా న్యూజిలాండ్, జపాన్ దేశాలలో పర్యటించి దక్షిణ కొరియా చేరుకున్న తెలంగాణ శాసన బృందం.

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ పోస్టుల భర్తీ – లోకేష్

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంనాటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ శాసనసభలో ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సమాధానం ఇచ్చారు. ఎటువంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశమని లోకేస్ స్పష్టం చేశారు. 1994 నుంచి కేసుల వివరాలు అధ్యయనం చేస్తున్నామని, పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.

మహాశివుని సేవలో మంత్రి సురేఖ

పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ ఈ రోజు(శుక్రవారం) ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివుని సేవలో తరించారు. దేవాలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి సురేఖ అర్చకుల వేదమంత్రాల నడుమ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. మహాశివునికి స్వహస్తాలతో హారతినిచ్చారు. దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖని శాలువాతో సత్కరించారు. దేవాలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ తరఫున తనవంతు సహకారం అందిస్తామని మంత్రి సురేఖ నిర్వాహకులకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ సర్కార్ పై కెటిఆర్ సెటైర్

పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిన చందంగా కాంగ్రెస్‌ సర్కార్‌ పాలన సాగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, కిరాయిలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేోయగానే.. 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారని విమర్శించారు. వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని మండిపడ్డారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయిందని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తోందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: అంబటి

శాసనసభలో తన తల్లిని అవమానించినట్లు లోకేష్ నిరూపిస్తే తాను బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైఎస్సీర్సీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారాలోకేష్ నిన్న శాసనసమండలిలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందిచారు. అసలు అనుచిత వ్యాఖ్యలపై కేసులే పెట్టదలచుకుంటే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు ఎక్స్ లో వ్యాఖ్యానించారు.

3వ దశలో ఢిల్లీ కాలుష్యం… పాఠశాలలకు సెలవు

ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకీ తీవ్రం అవుతోంది. వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా తీవ్రమైన వాయు కాలుష్యాన్ని రాజధాని నగరం చవిచూస్తోంది. శుక్రవారానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 409కి చేరుకుంది. నగరమంతా పొంగమంచు కప్పుకుని ఉండటంతో వాహదారులు రహదారులు కనపడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఉన్న 39 పొల్యూషన్ మానటరింగ్ సెంటర్లలో 21 సెంటర్లు తీవ్రమైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తున్నాయి. వజీర్పూర్, రోహిణీ, జహంగీర్ పురి, బవానా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 పై చిలుకు సూచిస్తుండటంత ఆ ప్రాంతాలను అత్యంత తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వర్గీకరించింది. ఢిల్లీలో కాలుష్య స్ధాయి మూడో దశలో ఉందని బోర్డు ప్రకటించింది. ఐదొవ తరగతి లోపు విద్యార్థులకు పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఇంటి వద్దే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిది. ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్-6 వాహనాలను మాత్రమే ఢిల్లీ నగరంలోకి అనుమతించి మిగిలిన వాహనాలకు నగరంలో నిషేధం విధించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com