33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

సంస్ధాగత ఎన్నికలపై బీజేపీ వర్క్ షాప్

పార్టీ సంస్ధాగత ఎన్నికలపై శనివారం భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్ధాయి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సంస్ధాగత ఎన్నికలపై కార్యాశాల జరుగుతుంది. ఈ కార్యశాలలో పార్టీ మండల అధ్యక్షుల ఎన్నికపై కసరత్తు చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక ప్రారంభమయ్యింది. డిసెంబర్ 15వ తేదీ నాటికి మండల అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసి జనవరి మొదటి వారానికల్లా జిల్లా అధ్యక్ష ఎన్నికలు ముగించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అదే నెలలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక కూడా జరుగుతుంది. శనివారం జరిగే వర్క్ షాప్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ బన్సల్ తో పాటు సభ్యత్వ నమోదు ఇన్ ఛార్జులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com