ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి బీజేపి జెండా ఎగరేయనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పలు సంస్థలు జరిపిన సర్వేలో మెజారిటీ బీజేపికే సానుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఢిల్లీలో సాయంత్రం 5గంటలకు 57.70 శాతం పోలింగ్ జరిగింది. గతంతో పోలిస్తే ఇది నాలుగు శాతం ఎక్కువ. 2020లో 54.20 శాతం పోలింగ్ జరిగింది.
న్యూఢిల్లీ, కాల్కాజీ, జంగ్‌పురాలో చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ మూడు స్థానాలు ఆప్‌కి కీలకమైన స్థానాలు. ఆప్ ఈసారి ప్రతిపక్షంగా మిగలబోతోందని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. మెజారిటీ సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 36 స్థానాలు. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
పీపుల్స్ ఇన్ సైట్ :
ఆప్ – 25-29
బీజేపీ – 40-44
కాంగ్రెస్ -0
పీపుల్స్ పల్స్ :
ఆప్ – 10- 19
బీజేపీ – 51 -60
కాంగ్రెస్ -0
మాట్రిజ్ :
ఆప్ – 32-37
బీజేపీ 35-40
కాంగ్రెస్ -1
పీ మార్క్ :
ఆప్ – 21-31
బీజేపీ – 39-49
కాంగ్రెస్ -1
పోల్ డైరీ :
ఆప్ 18-25
బీజేపీ – 42-50
కాంగ్రెస్ -2
ఆత్మసాక్షి :
ఆప్ – 27-30,
బీజేపీ – 38-41
కాంగ్రెస్ – 1-3
చాణిక్య స్ట్రాటజీస్ :
ఆప్ 25-28,
బీజేపీ – 39-44
కేకే సర్వే :
ఆప్ – 44
బీజేపీ – 26
ఢిల్లీ టౌమ్స్ నౌ :
ఆప్ – 22-31
బీజేపీ – 39-45