బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లు ఖరారు చేశారు. ఈ మేరకు బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
గతంలో వైఎస్ ఆర్ సిపి నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించిన ఆర్ కృష్ణయ్యకు తాజాగా బిజెపి నుంచి అవకాశం దక్కడం అనూహ్య పరిణామం. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మకు హర్యానా నుంచి కమలనాథులు చోటు కల్పించారు.