38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

సోమవారం మధ్యాహ్నాం వరకూ 6700 కోట్ల బిల్లులు చెల్లింపు

ఈ సంక్రాంతికి కొన్ని ముఖ్యమైన శాఖలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ పనిచేస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా  కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను సోమవారం మధ్యాహ్నం లోపల చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి పండుగలోగా మొత్తం 6700 కోట్ల రూపాయల మేర పెండింగ్‌ బిల్లుల చెల్లింపు జరిగిపోవాలనేది చంద్రబాబు నిర్ణయం. ఆమేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ నిన్న ఆదివారం కూడా బిల్లులు చెల్లింపులపై గంటగంటకూ సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. నిన్న ఆదివారం ఈ రోజు భోగి పండగ సందర్భాగా రెండు రోజులు సెలవు దినాలైనా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎక్కడా ఆగకుండా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. సీయం చంద్రబాబు ఆదేశించినట్లుగానే సోమవారం మధ్యాహ్నాని కల్లా మొత్తం 6700 కోట్ల రూపాయల మేర బిల్లులు క్లియర్ చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కూడా ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు చెల్లింపు పక్రియ ఎలా జరుగుతోందో తెలుసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com