28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

బైడెన్ అనూహ్య నిర్ణయాలు… అనుమానాలు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పెద్ద స్కెచ్ వేసినట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే గత నాలుగేళ్లలో చేయనంత పని ఈ నెల రోజుల్లోనే చేస్తున్నట్టు కనిపిస్తోంది. అత్యంత కీలకమైన నిర్ణయాలను చకా చకా తీసుకుంటున్నారు. అవి కూడా చాలా అనూహ్యమైన నిర్ణయాలనే చెప్పాలి. ప్రస్తుతం బైడెన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు.. బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన ఎలాన్‌ మస్క్‌పై బైడెన్ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. న్యూరాలింక్ అనేది మస్క్‌కు చెందిన సంస్థ. ఇప్పుడీ న్యూరాలింక్, ట్విటర్ షేర్ల కొనుగోళ్ల వ్యవహారంలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్‌ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఉన్నట్టుండి ఇప్పుడీ ఇన్వెస్టిగేషన్‌ పరుగులు పెట్టడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నెక్ట్స్‌ క్షమాభిక్షలు… అధ్యక్షుడిగా తనకున్న ప్రత్యేకాధికారాలను ఉపయోగించుకొని బైడెన్ ఇప్పటికే తన కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదించారు. రీసెంట్‌గా ఒకేసారి 39 మంది క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో 17 ఏళ్లు మొదలుకొని జీవితఖైదు అనుభవిస్తున్న వారంతా ఉన్నారు. అంతేకాదు సుదీర్ఘ జైలుశిక్ష అనుభవిస్తున్న దాదాపు 1500 మంది ఖైదీల శిక్షను కూడా తగ్గిస్తున్నారు.

ఉక్రెయిన్ విషయంలో అయితే బైడెన్‌ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. యుద్ధాన్ని ఆపాల్సిందే అని ట్రంప్ అంటుంటే.. ఆ యుద్ధాన్ని ఉసిగొల్పేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే తన టైమ్ దగ్గరపడుతున్న కొద్ది ఉక్రెయిన్‌కు సాయం పెంచుతూ పోతున్నారు బైడెన్. ఇప్పటికే రెండు సార్లు ఉక్రెయిన్‌కు ప్యాకేజీ అందించిన బైడెన్ సర్కార్.. మరోసారి 500 మిలియన్ డాలర్ విలువైన కొత్త ప్యాకేజీని ఇస్తామని ప్రకటించింది. అయితే యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఇటీవల ట్రంప్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి బైడెన్‌ రెండు సార్లు ఉక్రెయిన్‌కు సాయాన్ని పెంచారు.

అంతేకాదు బార్డర్ వాల్ నిర్మించి తీరుతామన్న ట్రంప్ హామీని తుంగలో తొక్కుతూ.. ఆ నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని తుక్కుగా మార్చి అమ్ముతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com