హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరగనున్నభారత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ ఈవెంట్‌జరగనుంది. హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో ఈ సమ్మిట్ జరుగుతుంది. సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
అయితే, ఈ ఏర్పాట్ల స్థితిని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితం నోవాటెల్‌కు వెళ్లారు.
భారత్ సమ్మిట్‌లో భాగంగా ప్రతినిధుల సమావేశం హాల్, కాన్ఫరెన్స్ హాల్, జస్టిస్ హాల్, లిబర్టి హాల్, ఎక్స్‌పో పాత్ ఆఫ్ జస్టిస్ హాల్, ఫోటో ఎగ్జిబిషన్, రిసెప్షన్ ఎదురుగా చరకాపై నూలు వడుకుతున్న మహాత్మా గాంధీ విగ్రహం తదితర ఏర్పాట్లన్నీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన భట్టి విక్రమార్క, కార్యక్రమ ఏర్పాట్ల నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.