తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క మొదట కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. కేబినెట్‌లో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాంబర్‌కు వెళ్లారు ఉప ముఖ్యమంత్రి.. మండలి చైర్మన్ గుత్తాకు బడ్జెట్ ప్రతులను అంద జేశారు.
అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌కు చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెడుతోన్న బడ్జెట్ ప్రతులను స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు అందజేశారు.
ఆ తర్వాత సభా నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్‌కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. వచ్చే యేడాది తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రతులను అందజేశారు.
ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రికి బడ్జెట్ ప్రతులను అందజేసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంట.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్లా శ్రీధర్ బాబు, ఛీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు , సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు ఉన్నారు.