12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో దేశం మొత్తం గర్వించిందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ఈ మూమెంట్స్‌ను మర్చిపోలేదు. ఈ విజయంపై బీసీసీఐ హర్షం వ్యక్తం చేసింది. అయితే కేవలం హర్షం వ్యక్తం చేసి ఊరుకోకుండా.. ఏకంగా రూ.58 కోట్ల క్యాష్ రివార్డ్‌ను ప్రకటించింది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు ఐసీసీ ఇచ్చే క్యాష్ రివార్డు కన్నా దాదాపుగా మూడు రెట్లు ఎక్కువ.
టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం అనేది ఓ హిస్టారిక్ మూమెంట్‌గా చూస్తోంది బీసీసీఐ. ఎందుకంటే ఈ టోర్నీలో ఒక్క ఓటమిని కూడా చూడలేదు. మొదట బంగ్లాదేశ్.. ఆ తర్వాత పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. ఫైనల్స్‌లో కివీస్‌ను చిత్తు చేసింది టీమిండియా. టీమ్ ఇండియా స్క్వాడ్‌లో ఉన్న ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్‌కు కూడా ఈ క్యాష్ ప్రైజ్ అందనుంది.
వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న టీమ్ఇండియా ప్లేయర్స్‌ను కృషిని బీసీసీఐ తప్పకుండా గుర్తింస్తుందన్నారు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ. ఈ క్యాష్ ప్రైజ్‌కు అందరూ అర్హులే అనే స్టేట్మెంట్ ఇచ్చింది బీసీసీఐ. నిజానికి ఈ ట్రోఫీ గెలిచినందుకు బీసీసీఐ భారత్‌కు రూ.19.50 కోట్ల వరకు ప్రైజ్ మనీ అందించింది. కానీ ఇప్పుడు బీసీసీఐ ఇచ్చిన అమౌంట్ దీనికి దాదాపుగా మూడు రెట్లు. ఈ లెక్కన చూసుకుంటే ఒక్కో ప్లేయర్‌కు రూ.3కోట్లు అందనున్నాయి. సపోర్ట్ స్టాఫ్‌కు మాత్రం రూ.50 లక్షల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది.