32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలులో ఉన్న ఐదుగురు నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత ఉపశమనం లభించింది. బెయిల్ పొందిన నిందితులు: A3 పండుగ నారాయణరెడ్డి, A4 రేఖమయ్య, A5 భజన రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డి. హైకోర్టు షరతుల ప్రకారం, వారు ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలి. రూ.25,000తో రెండు పూచీకత్తులు సమర్పించాలి. జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రవర్తన సరిగా లేకపోతే, బెయిల్ రద్దు చేయబడుతుంది.

2005 జనవరి 24న అనంతపురంలోని టిడిపి కార్యాలయంలో టీడీపీ నేత పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ముద్దాయిలకు 18 ఏళ్ల తర్వాత బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com