36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

రెచ్చిపోతున్న బీటెక్‌ రవి అనుచరులు

సొంతపార్టీ నేతలపైనే దాడులు

టీడీపీ నాయకుడు బీటెక్‌ రవి అనుచరులు కడప జిల్లాలో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ కాంటాక్టులు, ఇసుక ర్యాంపులు, చివరికి రేషన్ దుకాణలు అని కూడా చూడకుండా అన్నింటిలో తలదూర్చి సొంతపార్టీ నేతలనే బెదిరిస్తూ దాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతలపైనే వరుస దాడులు చేస్తూ కడపజిల్లాలో అరచకం సృష్టిస్తున్నరని బీటెక్‌ రవి, అతని అనుచరులపై ఆ పార్టీ నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న గురువారం ఇసుక టెండర్ల విషయంలో చేసిన గొడవ మరవక ముందే బీటెక్‌ రవి అనుచరులు శుక్రవారం టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి అనుచరుడిపై దాడి చేశారు. వేంపల్లికి చెందిన రామ్‌గోపాల్‌రెడ్డి అనుచరుడు ప్రకాష్‌ రేషన్‌ దుకాణం పొందడానికి పులివెందు పాఠశాలలో పరీక్ష రాయడానికి వెళ్లారు. అయితే రేషన్‌ షాపు తమకు కావాలని ప్రకాష్‌ని పరీక్ష రాయకుడా బీటెక్‌ రవి అనుచరులు అడ్డుకుని చితకబాదారు. అంతేకాకుండా ప్రకాష్‌ని ఎగ్జామ్‌ రాయకుండా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి ధర్నా చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ప్రకాష్‌ని విడిపించారు. ఇలాగే నిన్న గురువారం చక్రాయపేట, సిద్దవటం ఇసుక రీచ్‌ల టెండర్లు తమకి వదిలి వేయాలని కూటమి భాగస్వామి అయిన జనసేన నేత అతికారి కృష్ణ వర్గీయులు కలెక్టరేట్‌లోనే బాహాబాహీకి దిగారు. జనసేన నేత కృష్ణ వర్గీయుల నుంచి టెండర్‌ పత్రాలను లాక్కుని అక్కడి నుంచి పంపిచేశారు బీటెక్‌ రవి వర్గీయులు. ఈ సంఘటన మరవక ముందే శుక్రవారం రేషన్ షాపు విషయంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనుచరుడిపైనే దాడిచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com