27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అజహరుద్దీన్‌ అసహనం

ఉప్పల్‌ స్టేడియంలోని నార్త్‌ స్టాండ్‌కు తన పేరును తొలగించడంపై మాజీ ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్, క్రికెటర్‌ అజారుద్దీన్‌ అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌ పేరును ఉప్పల్‌ స్టేడియంలో నార్త్‌ స్టాండ్‌ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్‌మెన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో అజారుద్దీన్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పదేళ్ళ పాటు ఇండియన్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా, 19 ఏళ్ళు క్రికెటర్‌గా తాను దేశ క్రికెట్‌ జట్టుకు సేవలందించానని అలాంటి తన పేరుపై ఉప్పల్‌ స్టేడియంలోని నార్త్‌ స్టాండ్‌కు అజారుద్దీన్‌ స్టాండ్‌గా పేరు పెట్టుకున్నారని దానిపై కొంత మంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌తో కోర్టుల్లో పిటిషన్‌ వేయించారని అన్నారు. తనపై వచ్చిన పలు ఆరోపణలను గతంలోనే కోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక హైదరాబాదీగా దేశం గర్వించే స్థాయిలో తాను ఎదిగానని కొంత మంది కుట్రలు పన్నుతూ చేస్తున్న కుట్రలకు తాను న్యాయపరంగా సమాధానం చెప్తానిన అన్నారు.

దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ఈ వ్యవహారంపై పై కోర్టులకు తాను వెళ్తానని అన్నారు. ఉదయం నుంచి తనకు వేలాదిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని నార్త్‌ స్టాండ్స్‌కు తన పేరును తొలగించడాన్ని వారు ఖండిస్తున్నారని అన్నారు. ఆనాడు క్రికెట్‌ అభిమానుల కోరిక మేరకే తన పేరును స్టాండ్స్‌కు పెట్టారని అన్నారు. హెచ్‌సీఏలో సైతం ఎన్నో విభేదాలు ఉన్నాయని ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో కూడా టిక్కెట్ల వ్యవహారంపై జరుగుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com