27.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

యూట్యూబ్‌ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్ చూస్తున్నారా? జాగ్రత్త..

  • పదే పదే షార్ట్స్, రీల్స్ చూడటం రిస్కే
  • క్విక్ బైట్‌ సైజ్డ్ కంటెంట్ తో హాని
  • అదో వ్యసనంగా మారి, మెదడుపై తీవ్ర ప్రభావం
  • డోపమైన్ రిలాక్సేషన్ ద్రవాలు ఇంకిపోతాయ్
  • నిరంతరం అదే ఎంటర్ టైన్ మెంట్‌ను కోరుకునే బ్రెయిన్
  • మెదడు మొద్దుబారి ఆలోచన కోల్పొయే ప్రమాదం
  • కాగ్నిటివ్ ఓవర్ లోడ్ పెరిగి, ప్రోసెసింగ్‌ విధానానికి దెబ్బ
  • హరించుకుపోనున్న ఏకాగ్రత, సహనం, స్పందన శక్తులు
  • దీర్ఘకాలిక టాస్కుల నిర్వహణ పెద్ద సవాల్
  • నిమిషానికో కొత్త కంటెంట్, రిక్రియేషన్ కోరుకునే మనసు
  • ఇతరులతో పోల్చుకునే తత్వం పెరగడం
  • కంటినిండా కరువయ్యే నిద్ర, చదువులు దెబ్బతింటాయ్

మొబైల్ ఫోన్లు చూసే వారికి ఓ కొత్త జబ్బు పట్టుకుంటోంది ఈమధ్య. గంటల తరబడి షార్ట్స్, రీల్స్ చూడటం అలవాటుగా మారింది. అవి స్వల్పకాలం నిడివి కలిగినవి కావడంతో చాలా మంది కాలక్షేపానికి వాటిని చూస్తుంటారు. దీనికి పెద్దగా బ్రెయిన్ ఉపయోగించనక్కర లేదు. ఎక్కువ సమయం చూడనక్కర లేదు. చిన్న చిన్న వీడియోలు.. సింగిల్‌ ట్యాప్ తో మొబైల్‌ లో ఓపెన్ అయిపోతుంటాయి. నిమిషం వ్యవధిలోనే ప్లే అవుతుంటాయి కాబట్టి ఈమధ్య కాలంలో చాలా మంది ఇలా షార్ట్స్, రీల్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. బస్సుల్లో, రైళ్లలో, ప్రయాణాలలో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు టైమ్ పాస్ కోసం వాటిని చూడొచ్చు. ఏదో ఒక పంచ్ తో, నిమిషం వ్యవధిలోనే ఉంటాయి కాబట్టి మొబైల్‌ యూజర్ వాటికి ఎడిక్ట్ అవుతుంటాడు. దీనికి పెద్దగా కాన్సన్ట్రేషన్ కూడా అవసరం లేదు.

ఎవరైనా రిక్రియేషన్ కోసమో, కాలక్షేపానికో మొబైల్‌ లో షార్ట్ వీడియోస్ చూస్తారు. పూర్వకాలం నాటకాలు, పురాణ కాలక్షేపాలు, సినిమాలు ఉండేవి. బ్లాక్ అండ్ వైట్‌ యుగంలో ఒక్కో సినిమా నిడివి నాలుగు గంటలు, ఒక్కోసారి నాలుగున్నర గంటలూ ఉండేవి. కానీ రాను రాను అంత ఎక్కువ సమయం ఏకాగ్రతతో చూసే అలవాటు తప్పింది. స్పీడ్ యుగం వచ్చే సింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ మారిపోయింది. మన రిక్రియేషన్ పాట్రన్స్ కూడా మారిపోయాయి. అతి తక్కువ వ్యవధిలో స్పార్క్ లా ఓ చిన్న ఫ్లాష్‌ లా కంటెంట్‌ ను చూడటం అలవాటైంది.

టీవీలు, రేడియోలు వచ్చేశాక చదువుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ ఫన్ లేదా, క్రియేషన్ ను చూసేయగలుగుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాకతో వార్తల నుంచి, ఫన్ కంటెంట్‌ వరకూ అన్నీ టిట్‌ బిట్స్ లాగా నిమిషాల వ్యవధికి ఇప్పుడు క్షణాల వ్యవధికి మారిపోయాయి. చెప్పాలనుకున్న కంటెంట్‌ ను వన్‌ మినిట్ డ్యూరేషన్ కి కుదించి సూటిగా, స్పష్టంగా చెప్పగలగడం, చివరన ఒక పంచ్ యాడ్‌ చేసి ముగింపు చూపడం లాంటి ట్రెండ్‌ పెరిగింది. క్షణం తీరిక లేని ఉద్యోగాల రాకతో మనిషి రిక్రియేషన్ పాట్రన్స్ మారిపోయాయి. ఏదైనా ఒక నిమిషం మాత్రమే ఎంగేజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అలాగే వేరియేషన్ కోరుకుంటుండటంతో షార్ట్ రీల్స్, షార్ట్ వీడియోల కు ఆదరణ పెరిగింది.

డిజిటల్‌ మీడియా ఎఫెక్ట్‌…

కమ్యూనికేషన్ టూల్స్, టెక్నాలజీ,కంటెంట్ క్రియేషన్ మోడ్స్‌, మెథడ్స్ మారిపోయాయి. సోషల్‌ మీడియా రాకతో అందరూ షార్ట్స్ కి, రీల్స్ కి అలవాటు పడుతున్నారు.కంటెంట్‌ క్రియేషన్ లో వేరియేషన్స్ వచ్చేశాయి. క్రియేటివిటీలో పోటీ పెరిగింది.

షార్ట్ వీడియోస్, రీల్స్ తో ప్రమాదం

తక్కువ నిడివి కలిగిన కంటెంట్‌ పదే పదే చూడటం మన ఆరోగ్యానికి, మెదడుకి, కంటికి కూడా అస్సలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇన్ స్టాంట్‌ కోరిక…

యూట్యూబ్‌ షార్ట్ లు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ అన్నీ క్విక్ డెలివరీ ప్లాట్ ఫామ్స్. నిమిషంలోనే దాని కంటెంట్‌, పంచ్, ఫన్ అన్నీ ముగిసిపోతాయి. ఇది మనలో పదేపదే అలాంటి రీల్స్ చూడాలన్న ఒక కోరికను జనింప చేస్తుంది. ఏదైనా విషయాన్ని, లోతుగా ఆలోచించి ఓపికతో తీసుకోవాల్సిన నిర్ణయక శక్తిని కోల్పోయేలా చేస్తుంది. సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనడం, విషయాలను అర్ధం చేసుకునే కెపాసిటీని తగ్గించేస్తాయి.

ఏకాగ్రత కోల్పోడం…

షార్ట్ డ్యూరేషన్ వీడియోలు, కంటెంట్‌ వల్ల వేరియేషన్ కోరుకోడం అన్నది వ్యసనంగా మారుతోంది. ఏదైనా నిమిషానికి మించి భరించే ఓర్పు, సహనం ఉండదు. నిమిషంలోనే కంటెంట్‌ పూర్తయి పోవాలి. లేకపోతే మన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి చూడగా, చూడగా అదో వ్యసనం కింద మారుతుంది. అదే చివరికి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దాంతో దీర్థకాలంలో సహనంతో, ఏకాగ్రతతో ఓపికతో పూర్తి చేయాల్సిన టాస్క్ ల నిర్వహణ కష్టంగా మారుతుంది.

మానసిక సమస్యలు…

షార్ట్ ఫామ్ వీడియోస్, రీల్స్ చూడటం వల్ల దీర్ఘకాలంలో మనం ఏకాగ్రతను కోల్పోతాం. టాలరెన్స్ లెవెల్స్ దారుణంగా పడిపోతాయి. ఎదుటి వాళ్లు చెప్పే అంశంపై ఏకాగ్రత ఉండదు.వినే ఓపిక,సహనం ఉండవు.

నిద్రా భంగం…

ఇలాంటి షార్ట్ వీడియోస్ చూడటం వల్ల మన నిద్ర వేళలు, సమయం కూడా తగ్గిపోతుంటాయి. కంటి నిండా నిద్ర కరువవుతుంది. ప్రశాంతత కోల్పోతాము. పదే పదే మెలకువ రావడం, మన నిద్ర సైకిల్స్ దెబ్బ తినడం వల్ల రెండు, మూడు గంటలకు మించి పడుకోలేము.

ఆందోళన/ ఆతృత…

షార్ట్ వీడియోస్ చూసే అలవాటు మనలో ఎంగ్జైటీని పెంచుతుంది. ఎందుకంటే మనం ఒక కంటెంట్‌ని చూస్తున్నప్పుడు అందులోనే కంటెంట్‌ ఓపెనింగ్‌, ఎండింగ్‌ ఉంటాయి. కమ్యూనికేషన్ అంతా నిమిషంలో జరుగుతుంది కాబట్టి చివరకు ఏం చెబుతాడు, ముగింపు ఏంటి అన్న ఆతృత పెరుగుతుంది. కంటెంట్‌ పట్ల మన ఏకాగ్రత సస్టైనింగ్ కెపాసిటీ అంటే ఏకాగ్రతను నిలిపి ఉంచే శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా మెదడు ఆలోచనపై ప్రభావం చూపి యాంగ్జైటీని, ఆందోళన లేదా ఆతృతను పెంచేస్తుంది.

తగ్గుతున్న ఆత్మస్థైర్యం…

పదే పదే ఏదైనా కంటెంట్‌ ను చూడటానికి, వినడానికి అలవాటుపడిపోతే మనలో స్పందించే గుణం తగ్గుతూ ఉంటుంది. అది మనలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తగ్గించేస్తుంది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు మనసు యాంత్రికతకు అలవాటు పడ్డాక మనలో స్పందనలు తగ్గి పోతుంటాయి. షార్ట్ వీడియోస్ పదే పదే చూడటం వల్ల మన బ్రెయిన్ లో డోపమైన్ అనే రిక్రియేషన్ హార్మోన్ రిలీజ్ పై ప్రభావం చూపిస్తుంది. డోపమైన్ పదేపదే రిలీజ్ అయ్యే మెకానిజం కు బ్రెయిన్ అలవాటు పడటం వల్ల డోపమైన్ లెవెల్స్ త్వరగా హరించుకుపోతాయి. ఇది మన సహన శక్తిని తగ్గించేస్తుంది. మన రిలాక్సేషన్ మోడ్‌ మారిపోయి త్వరగా, వేగంగా, ఛట్ పట్‌ లాంగ్వేజ్ లో క్విక్ బైట్ లాగా మానసిక సమస్యలు పెరుగుతాయి. శారీరకంగా బలహీనులవుతారు. కంటి చూపు మందగిస్తుంది. దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తుంది. మానసిక ఉద్వేగాలు గతి తప్పుతాయి.

సరిపోల్చి చూసుకునే వ్యసనం…

ఇతర రీల్స్ తో సరిపోల్చి చూడడం, రీల్స్ ను ఇంకా చూడాలన్న తపన, వెంట వెంటనే కంటెంట్‌ మారిపోయి, కొత్తది చూడాలన్న ఆతృత ఈ షార్ట్ రీల్స్ పెంచేస్తాయి. ఇది అసహనానికి, ఆందోళనకు కారణమవుతుంది. సరిపోల్చుకునే జబ్బును పెంచుతుంది.

కాగ్నిటివ్‌ ఓవర్ లోడ్‌…

ఇదో మానసిక అనారోగ్యం. పదే పదే షార్ట్ రీల్స్ చూడటం వల్ల మన మెదడు నిక్షిప్తం చేసుకునే సమాచారం వేగంగా మారిపోతుంటుంది. ఇది మనలో మరింత అసహనానికి కారణమవుతుంది. మనిషి శరీర తత్వాన్ని బట్టి స్పందనలు, ఆలోచన, రియాక్షన్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి. కానీ షార్ట్ రీల్స్, షార్ట్ వీడియోలు మన సహజ శరీర ధర్మాలను, ఆలోచనా విధానాలను చంపేస్తాయి. దాని ఫలితమే అసహనం, ఏకాగ్రతా లోపం, ఆతృత, ఆందోళనా పెరుగుతాయి. ఎదుటి వాడు చెబుతున్న దానిని విని అర్ధం చేసుకుని ఓపికతో స్పందించడం తగ్గిపోతుంది. మనం చెప్పేది ఎదుటి వాడు వినాలన్న ధోరణి పెరుగుతుంది. మన బాధ ప్రపంచం బాధలా మారిపోతుంది. ఎదుటి వారి స్పందనలతో పని లేకుండా మన అవసరాలు, మన ఆలోచనలు, మన స్పందనలు.. ఇదేలోకం అయిపోతుంది. మనిషి సంఘజీవి. నలుగురితో కలిస్తేనే జీవితం.

కాబట్టి సోషల్‌ మీడియా ట్రెండ్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.. మరీ ఎక్కువ షార్ట్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చూడకండి. మీ జీవితాలను రిస్క్ లో పడేసుకోకండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com