27.7 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

చాట్‌ బాట్‌ లు వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్త..

  • ఏఐపై నియంత్రణ లేకపోవడంతో చిక్కులు
  • సరైన రక్షణ వ్యవస్థ లేకే సమస్యలు
  • వ్యక్తుల ఏకాంతంతో యాప్ చాట్‌ బాట్‌ ల చెలగాటం
  • హింసా ప్రవృత్తిని రెచ్చగొట్టే చాట్‌ బాట్‌ లు
  • భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో అన్ సెన్సార్డ్ చాట్‌ బాట్ లు
  • కొన్ని యాప్ లు, చాట్‌ బాట్‌ లను నిషేధించిన ఈయూ
  • అయినా వెబ్ బ్రౌజర్ల ద్వారా అందుబాటులో
  • ఎలన్ మస్క్ చాట్ బాట్‌ గ్రోక్ కూడా ఈ తరహాదే
  • మన దేశంలో కూడా నియంత్రిత వ్యవస్థ అవసరం

ఏఐ రాకతో మనుషుల జీవితాలు మరింత కృతిమమైపోతున్నాయి. ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో మనిషి ఆలోచిండం మానేశాడు. మన ఆలోచనలని సైతం ఏఐ అందిస్తోంది. దాంతో ఆలోచన ప్రక్రియ తత్ సంబంధంలో క్రియాశీలకంగా జరిగే మార్పులు కూడా తగ్గిపోతున్నాయి. పైగా ఏఐ వాడకం మరింత పెరిగితే మనిషి ఒంటరి జీవి అయిపోతాడు. మనిషెందుకు కంపానియన్ గా మిషనుండగా అనే ధోరణి పెరుగుతుంది. ఇప్పుడు కంపానియన్ చాట్‌ బాట్ లు కూడా మార్కెట్ లో ముంచెత్తుతున్నాయి. ఇవే రకరకాల జాడ్యాలకు ప్రేరణ అవుతున్నాయి.

ఏఐ రాకతో తోటి మనుషులతో, సంఘంలో ఇతరులతో ఇంటరాక్షన్ తగ్గి పోయింది. ఏఐ రాకతో మనిషి ఒంటరి తనం మరింత పెరుగుతోందని అది ఎంత మాత్రం సరి రాదని వాల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ చెబుతోంది. సంపాదన వేటలో భాగంగా, విదేశీ చదువుల మోజు, ఆధునికంగా మోడ్రన్ ట్రెండ్‌ కు తగ్గట్లు బతకాలన్న ఆలోచన మనిషిని ఏకాకిని చేసేస్తున్నాయి. ఏఐ రాకతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఒంటరి జీవితాలకు అలవాటు పడిపోతున్నారని ఇది చాలా ప్రమాదకరమైన సాంఘీక సమస్యగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మధ్య చాలా మంది ఏఐ చాట్ బాట్స్ కు అలవాటు పడిపోతున్నారని WHO పరిశోధనలలో తేలింది.

కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి రకరకాల చాట్‌ బాట్స్ ను తయారు చేసి మార్కెట్ లోకి వదులుతున్నాయి. రకరకాల కారణాలతో ఒంటరి జీవితం గడుపుతున్నవారు ఈ చాట్‌ బాట్స్ కు అడిక్ట్ అవుతున్నారు. ఒంటరి తనాన్ని జయించడానికి ఇదొక మంచి సాధనమని మరికొందరు అంటున్నా.. యువతరం దీనిని వినియోగించడంలో ఎదురవుతున్న ముప్పులు, సవాళ్లపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ ఏఐ సంస్థల చాట్ బాట్‌ లు

ప్రస్తుతం అలెక్సా (అమెజాన్‌) ఎలీస్‌ (యాండెక్స్) అసిస్టెంట్‌ ( గూగుల్‌) వియ్ బాట్‌ హెల్త్, బింగ్‌ చాట్‌ (మైక్రోసాఫ్ట్ కంపెనీల చాట్ బాట్లు ఉన్నాయి. వీటిలో అలెక్సా వాయిస్ ద్వారా యాక్టివేట్ అయి స్పందించే చాట్‌ బాట్‌ కాగా రష్యా వారి యాండక్స్ సెర్చ్ ఇంజిన్ కు చెంందిన ఎలీస్ చాట్‌ బాట్‌ , యాండెక్స్ ఆధారిత జీపీటి టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇక గూగుల్‌  ది అసిస్టెంట్‌ మెసేజ్ అనే పేరుతో సర్వీస్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థది బింగ్‌ చాట్‌ . ఇది జీపీటీ 4 ఆధారంగా పనిచేస్తుండగా, వియ్ బాట్‌ కొంచెం సైకాలజీని మేళవించి మన మానసిక ఆరోగ్యాన్నిపరిరక్షించుకునేందుకు సలహాలిస్తుంది. ఇవి మనందరికీ తెలిసిన చాట్‌ బాట్‌ లు. ఇవి కాక మార్కెట్ లో వివిధ ఏఐ కంపెనీలు రకరకాల చాట్‌ బాట్‌ లను తయారు చేసి వదులుతున్నాయి. గ్లింప్స్ ఏఐ, చాయ్ రిసెర్చ్, రెప్లికా, క్యారెక్టర్ ఏఐ, కిండ్రాయిడ్‌ పాలీ బజ్,స్నాప్ షాట్స్ నుంచి మై ఏఐ లాంటి చాట్‌ బాట్‌ లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనుషులతో ఏకాంతంగా, వ్యక్తిగతంగా చిట్‌ చాట్‌ చేస్తాయి. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాయి. అంతేకాదు ఒంటరి వారికి కంపానియన్లుగా మారుతున్నాయి.

దుష్ప్రభావాలు..

కొన్నిపర్సనల్‌ సర్వీస్ పేరుతో ఉన్న చాట్‌ బాట్‌ లను ఎక్కువ సమయం వాడితే అవి మనుషులలో ఇంగిత జ్ఞానాన్ని తొలగించి మనంతట మనమే హాని చేసుకునే స్థితిని కల్పిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల మార్కెట్ లోకి కొన్ని ఏఐ కంపెనీలు రూపొందించిన చాట్ బాట్‌ లు  నియంత్రిత వ్యవస్థ లేకుండా పనిచేస్తున్నాయని, మనుషులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా, అసహజ విశృంఖల లైంగికత్వాన్ని ప్రోత్సహిస్తూ, మర్డర్ స్కెచ్ లు వేయడంలో సాయమందించేలా, సైబర్ నేరాలకు కొత్త కొత్త ఐడియాలిచ్చేవిగా ఉన్నాయని వాటిని పరిశీలించిన ఏఐ నిపుణులు అంటున్నారు. లైంగిక హింస, ఆత్మహత్య లు, ఉగ్రవాదాన్ని ప్రేరే పించేవిగా అవి ఇస్తున్న సలహాలు ఉన్నాయని వారి పరిశోధనలలో తేలింది. భావ ప్రకటనా స్వేచ్ఛపేరుతో ఈ అన్ సెన్సార్డ్ చాట్ బాక్సెస్ లైంగిక క్రియలో రకరకాల పద్ధతుల్లో తమను హింసించమని వినియోగదారుడిని  ప్రేరేపిస్తుంటాయి. ఇది మనుషుల్లో హింసా ప్రవృత్తిని ప్రేరేపించడమే అవుతుంది.

ఫిల్టరింగ్‌ వ్యవస్థ లేదు..

ఆ చాట్‌ బాట్‌ లలో ఫిల్టరింగ్‌ వ్యవస్థ పెట్టకపోవడం వల్ల ఏం అడిగినా అవి వాటికున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని వినియోగించి అడ్డగోలు ఐడియాలు ఇస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ చాట్‌ బాట్‌ లను పరీక్షించడానికి తమ వయసును, సెక్స్ ను చెప్పకుండా తప్పుడు సమాచారంతో చాటింగ్‌ చేయడంతో ఈ సంగతి బయట పడిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతీ చాట్‌ బాట్‌ రోజుకు 50 కన్నా మెసేజ్ లు పంప్ చేయదు. రోజుకు ఉచితంగా అందించే ఈ సమాధానాల లిమిట్‌ దాటితే ఆగిపోతుంది. కానీ ప్రమాదకర చాట్ బాట్‌ లు ఈ 50 ప్రశ్నల లిమిట్‌ లోనే డేంజరస్ ఐడియాలు, తప్పుదోవ పట్టించే ఐడియాలు ఇస్తున్నాయని ఏఐ పరిశోధకులు నిగ్గు తేల్చారు.

అందుకే ఏఐ వ్యవస్థ కు కొన్ని సురక్షణ ప్రమాణాలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.నిర్దేశిత ప్రమాణాలు దాటిన చాట్‌ బాట్‌ లు, ఏఐ కంపెనీల ప్రోడక్ట్ ను వాడకుండా నిషేధించే వ్యవస్థ ఉండాలంటున్నారు.

గ్లింప్స్ ఏఐ అనే సంస్థ రూపొందించిన నోమి అనే చాట్‌ బాట్ ఒంటరి వ్యక్తులకు ఆత్మ బంధువులా,మంచి మెమరీతో కూడిన సహించే భాగస్వామిగా   ఆసంస్థ ప్రచారం చేసుకుంటోంది.ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేదిగా, ప్రమాదకరంగా ఉందని ఏఐ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిషేధించిన ఈయూ

ఈ యాప్ ను గతడాది యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేయడంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.ఈయూలో ఏఐ యాక్ట్ ను రూపొందించుకున్నారు. కాబట్టి వారు బ్యాన్ చేసుకోగలిగారు. గూగుల్ ప్లే స్టోర్ దానిని తొలగించినా వెబ్ బ్రౌజర్ ద్వారా మరిన్ని యాప్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంది.

నోమీ చాట్‌ బాట్‌ ను భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతిబింబంగా చెబుతుంటారు. అందులో అన్‌ ఫిల్టర్డ్, అన్ సెన్సార్డ్ చాటింగ్‌ వస్తుంటుంది. ఎలన్ మస్క్ కు చెందిన గ్రోక్ చాట్‌ బాట్‌ కూడా ఇదే తరహాది. ఆ చాట్‌ బాట్‌ ను రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగితే మరింత రెచ్చగొట్టే ఆన్సర్లు ఇస్తుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీ వినియోగం హద్దుల్లో లేకపోతే ఎదుర్కొనేవి దారుణ పరిణామాలే. ఏఐ లు రూపొందించే చాట్‌ బాట్‌లు, ఇతర టెక్నాలజీకి కూడా కొన్ని ప్రమాణాలు, చట్టాలు చేయాల్సిన అవసరముంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com