28.1 C
Hyderabad
Monday, October 26, 2026

Live Video

spot_img

ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమించిన 410 మంది ఫైబర్ నెట్ ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ప్రకటించారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన చైర్మన్ ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ని దివాలా అంచుకు తీసుకవెళ్ళారని జీవీరెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతల ఆదేశాలతో అర్హత లేనివారిని ఉద్యోగాల్లో నిమించారని అలాంటి 410 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఆయన తెలిపారు. కొంతమంది ఉద్యోగులు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్ళలో పని చేశారని వాళ్లకి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని జీవీరెడ్డి అన్నారు. మేము దురుద్దేశంతోనో కక్షతోనే ఉద్యోగులను తొలగించడం లేదన్న ఫైబర్ నెట్ చైర్మన్ ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని పేర్కొన్నారు. అలాగే ఆర్జీవీ వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి కోట్లు దోచిపెట్టారని ఆడబ్బు తిరిగి చెల్లించమని ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నోటీసులపై వర్మ స్పందిచకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి స్పష్టం చేశారు. అయితే మొదటి విడతగా 410 మంది ఉద్యోగులను తొలగించాలని ఆ తరువాత మరో 200 మంది ఉద్యోగులను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలనే ఆలోచనలో ఫైబర్ నెట్ ఉన్నట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com