తిరుమలలో అపశృతుల పరంపర కొనసాగుతోంది. తిరుమల ఘాట్‌రోడ్డులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 7వ మైలు దగ్గర శ్రీవారి ప్రయాణీకులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్నారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బోల్తా పడింది. దీంతో, కారులో ఉన్న వాళ్లు గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అదే దారిలో వెళ్తున్న తోటి వాహనదారులు వెంటనే టీటీడీ సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, టీటీడీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ శ్రీవారి భక్తుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఆ రోడ్డులో వెళ్తున్న మిగతా ప్రయాణీకులు వీడియో తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.