31.7 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

జార్ఖండ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు మరోసారి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో కొన్నాళ్లుగా వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతుండగా.. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ ఈ పరిస్థితి నెలకొంది. జార్ఖండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బొకారో జిల్లాలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.

లాల్పానియా మండలంలోని లుగు హిల్స్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ 209 బెటాలియన్‌కు చెందిన స్పెషల్‌ యూనిట్ అయిన కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

ఎన్‌కౌంటర్ అనంతరం, పోలీసులు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌, రైఫిల్స్‌ వంటి ఆయుధాలు సంఘటనా స్థలంలో దొరికాయి. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు స్వాధనం చేసుకున్న భద్రతా బలగాలు.. అక్కడి నుంచి ఆ మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన కోబ్రా దళాల కృషిని అధికారులు కొనియాడారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com