24 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

రామాలయ నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తి

  • అత్యద్భుతంగా రామ దర్బార్ నిర్మాణం
  • మే23న రామదర్బార్లో విగ్రహాల ఏర్పాటు
  • జైపూర్ పాండేమూర్తి కళా కేంద్ర శిల్పుల ప్రతిభ
  • దాదాపు 19 విగ్రహాలను రూపొందించిన శిల్పులు
  • రామరాజ్యాన్ని, దర్బార్ ని చూసిన అనుభూతి
  • జూన్6 నుంచి సందర్శకులకు అనుమతి
  • శాస్త్రోక్తంగా అన్ని క్రతువుల నిర్వహణ
  • 2020 నుంచి నిరాటంకంగా సాగుతున్న రామాలయ నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాంగణంలోనే రాముడి రాజ్యపాలన ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. రాముడి సభ ను ప్రతిబింబించే విధంగా రామాయణంలోని కీలక ఘట్టాన్ని ప్రతిబింబించే దర్బార్ ను ఏర్పాటు చేస్తున్నారు. రామ్ దర్బార్ ను జూన్ 6 నుంచి భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు. అంతకుముందు మే 23న సీతా సమేత రామ, లక్ష్మణ, విగ్రహాలను దర్బార్ హాలులో ప్రతిష్టించనున్నారు. మూడు రోజుల పాటు దీనికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి.

రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శతృఘ్నలు, హనుమాన్ విగ్రహాలను దర్బార్ హాలులో రామపట్టాభిషేక ఘట్టం రూపంలో కొలువుతీర్చనున్నారు. రామ దర్బార్ ను జూన్6 నుంచి భక్తుల సందర్శనార్ధం తెరుస్తారు. ఈసందర్భంగా జలవాస్, అన్నవాస్, ఔషధివాస్, షయ్యావాస్ లాంటి పవిత్ర క్రతువులను నిర్వహిస్తారు. అయితే ఈ సందర్భాన్ని ప్రాణ ప్రతిష్టలా భావించరాదని, రామ్ లల్లా విగ్రహాలకు గతేడాది జూన్22నే ప్రాణ ప్రతిష్ట జరిపామని అధికారులు ప్రకటించారు.

జైపూర్ శిల్పుల ప్రతిభ

రామ రాజ్యంలో రాముడి దర్బార్ కొలువైన తీరును ప్రతిబింబించే విధంగా దాదాపు 19 విగ్రహాలను జైపూర్ కు చెందిన పాండే మూర్తి కళా కేంద్ర శిల్పులు రూపొందించారు. రాముడు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్య బాధ్యతలు తీసుకున్నతర్వాత ఘట్టాన్ని ఆవిష్కరించే ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేయనుంది.
మందిర నిర్మాణం పూర్తి

ఈ ఘట్టం పూర్తయితే 2020 నుంచి నిరాటంకంగా సాగుతున్న రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తయినట్లే.ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో చరిత్రలో ఒక మహాద్భుత నిర్మాణం పూర్తి చేసుకున్నట్లే. రామ భక్తులు జూన్ 6 నుంచి ఆధ్యాత్మికతను ప్రతిబింబించే రామాలయంతో పాటు రామ దర్బార్ కూడా దర్శించి తరించవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com