పుష్ప2 సినిమా తొక్కిసలాట వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు సమయాత్తమవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుపై కుటుంబసభ్యులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టు ను కోరిన బన్నీ తరపు న్యాయవాదులు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి…సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
దీనిపై వివరణ ఇచ్చిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్ రెడ్డి పోలీసుల నుంచి వివరాలు తీసుకొని లంచ్ తర్వాత ప్రభుత్వ వైఖరి వెల్లడిస్తామని వివరించారు.
మరికాసేపట్లో ఈ కేసుపై విచారణ జరిపి న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది.