32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

విచారణకు హాజరైన అల్లు అర్జున్

సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ నిమిత్తం సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సీఐ రాజు నాయక్ ముందు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలను జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖరరెడ్డి, నిర్మాత బన్నీవాసులతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ బయలుదేరారు. దుర్ఘటన జరిగిన రోజు అసలేం జరిగింది. ఎన్ని గంటలకు మీరు ధియేటర్ వద్దకు వచ్చారు, అనుమతి లేదని మీకు తెలుసా, పోలీసులు వెళ్లిపోమ్మన్నా మీరు ఎందుకు వెళ్ళలేదు, వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఊరేగింపుగా ఎందుకు వెళ్లారు తదితర పది, పన్నెండు ప్రశ్నలు పోలీసులు అల్లు అర్జున్ని అడగనున్నట్లు తెలిసింది. విచారణకు తనతో పాటు తన లాయర్ల బృందాన్ని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com