36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

తెలంగాణలో టికెట్ల రేట్లపై అల్లు అరవింద్‌ హాట్‌ కామెంట్స్‌

సినీ నిర్మాత అల్లు అరవింద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తండేల్‌ సినిమా ఫంక్షన్‌లో టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు సంబంధించి మీడియాతో చిట్‌చాట్‌లో హాట్‌ కామెంట్స్‌ చేశారు. తండేల్‌ సినిమాకు సంబంధించి తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచమని అడగలేదన్నారు. అడగాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ ఎలాగూ టికెట్‌ రేట్లు ఎక్కువే ఉన్నాయని కవర్‌ చేసుకున్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్‌ ధరలు తక్కువగా ఉన్నాయని అందుకే అక్కడ పెంచమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అల్లు అరవింద్‌ చెప్పారు. అది కూడా కేవలం 50 రూపాయలు మాత్రమే పెంచాలని ప్రభుత్వాన్ని అడిగామని, ప్రభుత్వం తమ విజ్ఞప్తికి ఓకే చెప్పిందన్నారు. అది కూడా తొలి వారం రోజులు మాత్రమే టికెట్‌ రేట్లు పెంచుతామన్నారు.

ఇక, బెనిఫిట్‌ షోలకు సంబంధించి కూడా అల్లు అరవింద్‌ ఇదే తరహాలో మాట్లాడారు. తెలంగాణలో బెనిఫిట్ షో లకు పర్మిషన్‌ అడగలేదన్నారు. తమకు అంత బెనిఫిట్ అవసరం లేదని అల్లు అరవింద్‌ వ్యాఖ్యానించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com