29.1 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

పాడుతా తీయగా న్యాయనిర్ణేతలపై ఆరోపణలు

బుల్లితెరపై ప్రముఖ సింగింగ్‌ రియాల్టీ షో, ఈటీవీలో ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు కేంద్ర బిందువు అయింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు 30 ఏళ్లుగా తెలుగు ప్రజల ఆదరణ చురగొంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీతలు తనను తీవ్రంగా అవమానించారని  గాయని ప్రవస్తి ఆరాధ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. న్యాయ నిర్ణేతలు తనను మానసికంగా హింసించారని, బాడీషేమింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.

దీనికి సంబంధించి ప్రవస్తి ఓ వీడియా విడుదల చేసింది. అందులో అనేక ఆంశాలను ప్రస్తావించింది. పోటీదారులను వారు చీడపురుగుల్లా చూస్తారని, వివక్ష చూపుతారని ఆరోపించారు. తమ శరీరం మీద జోకులు వేస్తారని, ఇది తనను మానసికంగా కృంగిపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిర్వాహకులు తనకు చీర ఇచ్చి దాన్ని బొడ్డు కిందికి కట్టుకోవాలని సూచించారని, ఇది తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రవస్తి వివరించింది.  సునీత పాడిన పాట, చంద్రబోస్ రాసిన పాటలు కాని, కీరవాణికి సబంధించిన పాటలు పాడితే వెంటనే పైకి లేచి చప్పట్లు కొడతారు, ఆ పాట బాగా పాడినా పాడకపోయినా అద్భుతం అంటారు.

మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే అవమానాలు, వివక్ష బయటి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వీడియో పెట్టానని వివరణ ఇచ్చింది. పాడుతా తీయగా షోలో జడ్జీలు చాలా పక్షపాతం చూపించే వారు. తమకు నచ్చిన వారు ఉంటే.. వారిని ప్రోత్సాహించి ఎక్కువ మార్కులు వేసే వారు. సాంగ్స్ సెలక్షన్‌లో కూడా వివక్ష చూపించే వారు. సాధారణంగా 6 పాటలు ఇస్తాం. కానీ వారు ఆమోదించకపోయేవారు. ఇంకా ఇవ్వమని అడిగే వారు. అదీ కాకుండా మగ గొంతుతో ఉండే పాటలు ఇచ్చి పాడమనే వారు. అయినా పాడి చూపించానని ప్రవస్తి చెప్పుకొచ్చింది.

కాగా ప్రవస్తి ఆరోపణలను గాయని సునీత ఖండించారు. ఎవరు బాగా పాడినా ప్రోత్సహిస్తాం. సంగీతం విషయంలో చానల్స్‌ వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ ప్రేక్షకులకు వివరించు. పోటీదారులంతా నాకు సమానమే’ అని పేర్కొన్నారు.

కీరవాణి వైఖరి అలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే గాయనిగా ప్రవస్తి తన భవిష్యత్తును ఫణంగా పెట్టి విమర్శలు చేసిందని విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రవస్తికి మానసిక పరిపక్వత కొరవడిందని, ఆరోపణలు చేసేటపుడు హుందాగా వ్యవహరించాల్సిందని అంటున్నారు.

అయితే సోషల్‌ మీడియాలో ప్రవస్తి చేసిన ఆరోపణలను నెటిజన్లు సమర్థించారు. అధికశాతం నిర్వాహకులు, జడ్జీల తీరును తప్పుపట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com