హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.
టీజర్ మెయిన్ గా అల్లరి నరేష్ పాత్రపై ఫోకస్ చేస్తోంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ ని కేర్ ఫ్రీ, మొండిపట్టుదల, మూర్ఖత్వం వ్యక్తిగా టీజర్ హైలెట్ చేస్తోంది. అమృత అయ్యర్ క్యారెక్టర్ రిజెక్ట్ చేసినప్పటికీ ధైర్యంగా ఆమెతో ఫ్లర్ట్ చేస్తాడు. అతను ఇతరుల అభిప్రాయాలని పట్టించుకోకుండా తన స్వంత నిబంధనలపై జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. నరేష్ పాత్ర పిల్లల నుంచి విరాళాల పెట్టెను తీసుకున్నప్పుడు, అతని రియల్ నేచర్ ని ప్రజెంట్ చేసే మూమెంట్ తో టీజర్ ఎండ్ అయ్యింది.
నరేష్ మాస్ లుక్ ప్రయాణంలో అమృత అయ్యర్ కీలక పాత్ర పోషిస్తుండగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కూడా ఉన్నారు.