36.2 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

చర్చంతా హర్షిత్‌ రాణా ఎంట్రీపైనే.. ఇంతకీ ఇది సరైన పద్దతేనా?

నిన్నత ఇంగ్లండ్-ఇండియా టీ20 మ్యాచ్‌ చూసిన వారికి హర్షిత్‌ రాణా ఎంట్రీపై కచ్చితంగా మాట్లాడుకుంటారు. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఇంగ్లండ్ మాత్రం ఈ ఓటమిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. దానికి కారణం హర్షిత్‌ రాణా. ఎందుకంటే హర్షిత్‌ పేరు ఈ మ్యాచ్‌ ఫైనల్ టీమ్ లిస్ట్‌లో లేదు. కానీ అతడు గ్రౌండ్‌లోకి వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. మూడు వికెట్లు తీశాడు.. టీమిండియా విక్టరీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు.

నిజానికి నిన్నటి మ్యాచ్‌లో భారత్‌ హైస్కోర్‌ చేయడానికి శివమ్ దూబే కారణం. ధనాధన్ షాట్లతో మ్యాచ్‌ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. అయితే అదే సమయంలో గాయపడ్డాడు దూబే. దీంతో అతని స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. నిజానికి ఇదే హర్షిత్‌కు ఇదే తొలి టీ20  మ్యాచ్‌. ఈ రకంగా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌ ఇండియాలో ఎవరూ లేరు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని పర్‌ఫెక్ట్‌గా ఉపయోగించుకున్నాడు రాణా.

అయితే ధనాధన్ బ్యాటింగ్ చేసిన దూబే.. అతని స్థానంలో వచ్చిన హర్షిత్‌ ఇంగ్లండ్ ఓటమికి కారణాలుగా ఉన్నారు. దీంతో ఆ టీమ్ మాజీ ప్లేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదంటున్నారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం బ్యాట్స్‌మెన్ గాయపడితే బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలి.. బౌలర్ గాయపడితే బౌలర్‌ను తీసుకోవాలి. కానీ దూబే అప్పుడప్పుడు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. అతని స్థానంలో హర్షిత్‌ను తీసుకోవడం ఏంటనేది ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ల క్వశ్చన్.

మాజీలు మాత్రమే కాదు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా దీనిపై కోచ్‌, ఎంపైర్లతో డిస్కస్ చేశారు. కానీ ఫలితం మాత్రం ఇండియాకు అనుకూలంగానే వచ్చింది.  కానీ ఇంగ్లండ్ కెప్టెన్ మాత్రం దీనిని వదిలిపెట్టే పరిస్థితిలో లేడు. అసలు మాతో ఓ మాట కూడా చెప్పలేదన్నాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.. దీనిపై క్లారిటీ తీసుకుంటామని చెబుతున్నాడు బట్లర్.

కానీ ఐసీసీ రూల్స్‌ మాత్రం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బౌలర్ గాయపడితే బౌలర్‌ని.. బ్యాటర్ గాయపడితే బ్యాటర్‌ని.. ఆల్‌రౌండర్‌ గాయపడితే ఆల్‌రౌండర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఫైనల్ డెసిషన్‌ మాత్రం మ్యాచ్‌ రిఫరీదే ఉంటుంది.  నిజానికి ఈ నిర్ణయంపై అప్పీల్ చేసే చాన్స్ ఉండదు. మరీ ఇంగ్లీష్‌ టీమ్‌ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

అయితే హర్షిత్‌ రాణాను విమర్శించాల్సిన అవసరం లేదంటున్నారు మరికొందరు మాజీలు చెబుతున్నారు. హర్షిత్‌ రాణాకు మేనేజ్‌మెంట్‌ చాన్స్ ఇచ్చింది. ఏ బౌలరైనా తనకు వచ్చిన చాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. హర్షిత్‌ అదే చేశాడని చెబుతున్నారు మాజీ ప్లేయర్ కెవిన్ పిటర్సన్. అయితే ఇంగ్లండ్ అభ్యంతరాలను కూడా కొట్టిపారేయలేమన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com