30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఐటీ, అడ్వాన్స్డ్‌ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం

  • మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో- ఏపీఎస్ఎస్ డీసీ ఎంఓయు
  • ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు మేలు
  • డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ

రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య (డిగ్రీ, ఇంజనీరింగ్), వృత్తివిద్య  అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటి సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షాన ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల  ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను అందిస్తుంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి,  వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యం.

మారుతున్న సాంకేతికలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు, ఉద్యోగులకు సిస్కో సర్టిఫికెట్లను జారీచేస్తుంది. ఏపీఎస్ఎస్ డీసీ ద్వారా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లను అందిస్తారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్  దేడ్రిచ్, గవర్నమెంట్ అఫైర్స్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్, సేల్స్ బిజినెస్ డెవలప్ మెంట్ డైరెక్టర్ కె.వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com