30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

మెరుపుతీగ సిమ్రత్ కౌర్

సిమ్రత్ కౌర్ పేరు తగిన అందం. తెలుగు, హిందీ సినిమాల్లో మెరిసిన సిమ్రత్ కొన్ని పంజాబీ మ్యూజిక్ అల్బమ్స్ లో కూడా నటించింది. అరడజను పైగా సినిమాలు చేసిన అమ్మడికి బ్రేక్ రాలేదు. బోల్డ్ పాత్రలతో యువతరాన్ని మైమరిపించే మెరుపుతీగ సిమ్రత్ కౌర్… తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముంబైలో 1997లో జన్మించిన సిమ్రత్ కౌర్… బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసింది. కాలేజీ చదువులు అయిపోగానే సినిమాల మీద కన్నేసింది ఈ బ్యూటీ.2017లో ప్రేమతో మీ కార్తీక్ తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో కార్తికేయతో జతకట్టింది. 2018లో సోని హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది తెలుగులో పరిచయం సినిమా చేసింది.అగ్రహీరో నాగార్జునతో బంగార్రాజు సినిమాలో ఓ పాట కోసం జతకట్టింది. నాగార్జునతో సినిమా చేసిన కుర్రది అంటే విషయం ఉన్నట్టే అనే టాక్ తెలుగు చిత్రపరిశ్రమలో ఉంది.అదే విధంగా గదర్-2 హిందీ సినిమాలో హీరో సన్నీ డియోల్ కోడలిగా నటించి పాపులారిటీ సొంతం చేసుకుంది.సిక్కు సంతతికి చెందిన సిమ్రత్…ఒడ్డు పొడుగు ఆకట్టుకునే అందం ఉన్నా సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో దూసుకుపోలేకపోతోంది.2026లో రాబోయే గదర్-3లో లీడ్ రోల్ చేస్తున్నా అమ్మడికి ఎక్కడో అసంతృప్తి ఉంది. తన అందానికి అభినయానికి సరిపడా సినిమా చాన్స్ లు రావడం లేదని సిమ్రత్ బెంగ పెట్టుకుంది.

courtesy: instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com