మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా. తెలుగు, తమిళం, హింది, పంజాబీ చిత్రపరిశ్రమలో ఈ బ్యూటీ సందడి చేస్తోంది. మూడు పదులు దాటేందుకు దగ్గరకు వచ్చినా ప్రెట్టి లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
సిక్కు కుటుంబానికి చెందిన మెహ్రీన్ 1995లో పంజాబ్ లోని భటిండాలో జన్మించింది
పదేళ్ల వయసులోనే ర్యాంప్ పై తన సత్తా చాటిన మెహ్రీన్ మిస్ కసౌలీ టైటిల్ సాధించింది
2013లో కెనడాలో జరిగిన అందాల పోటీలో మిస్ సౌత్ ఏషియాగా టైటిల్ సొంతం చేసుకుంది
2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాలో నటించి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయింది
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాలో నానీ సరసన నటించి వరుసగా ఆఫర్స్ కొట్టేసింది
నిషా కళ్ల మెహ్రీన్ 2017లో ఫిల్లౌరీ హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
రాజా ది గ్రేట్ తో పాపులారిటీ సాధించిన మెహ్రిన్ ఎఫ్-2, ఎఫ్-3 తో తెలుగులో ఓ వెలుగు వెలిగింది
హిందీలో పాగా వేసేందుకు మెహ్రీన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నా అంతగా ఆఫర్స్ రావటం లేదు. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది.
courtesy : instagram