బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసాల్లో సోమవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఫార్ములా ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు చెందిన నంది నగర్ నివాసం, గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సోమవారం ఉదయమే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌ని వెంట లాయర్లు ఉన్నారని కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో తన సమాధానాన్ని లేఖ రూపంలో ఏసీబీ అధికారులకు కార్యలయం బయటే సమర్పించి కేటీఆర్ వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ రాజ్యాంగపరంగా నాహక్కులను కూడా వినయోగించఉకోనివ్వడం లేదని ఆరోపించారు. తాను లేనప్పుడు తన ఇళ్ళలో తనిఖీలు చెయ్యాలని ఏసీబీ చూస్తోందని చెప్పారు. సీయం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు నా ఇంట్లో ఏదైనా పెట్టి ఏదో దొరికినట్లు చూపించాలని చూస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నేను దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై న్యాయస్ధానం తీర్పు రిజర్వ్‌లో ఉన్నప్పటికీ నన్ను విచారణకు పిలవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఫార్ములీ ఈ కారు రేసు కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించి తుది తీర్పు వచ్చేంత వరకూ అరెస్ట్ చెయ్యద్దని న్యాయస్ధానం నుంచి ఉపశమనం పొందారు. అయితే సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కాకుండా బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం బయట నుంచే వెళ్ళిపోయిన కేటీఆర్‌కు విచారణకు హాజరుకావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.