30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

కేసుల వలయంలో పోసాని కృష్ణమురళి

పోసాని కృష్ణమురళికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆయనను ఓ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు చూపించి చంద్రబాబు,లోకేష్, పవన్ లను దూషించిన వ్యవహరంపై ఆయనపై టీడీపీ అధికార ప్రతినిధి బండారి వంశీకృష్ణ కేసు పెట్టారు. సమాజంలో వర్గాల మధ్య ద్వేషాన్ని  పెంచి అల్లర్లు చెలరేగే కుట్ర చేశాడన్న కారణంగా ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయనపై ఇతర కేసులు చాలా ఉన్నాయి. వాటిలో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారనుకున్న సమయంలో సీఐడీ పోలీసులు  పీటీ వారెంట్ పై అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

సీఐడీ కోర్టులో హాజరుపరిచినప్పుడు  70 ఏళ్ల వయసులో తనను అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారని… అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పడంలేదని వాపోయారు. అన్యాయంగా వాదనలు వినిపిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు తనకు లైడిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని  ఇప్పటికే రెండుసార్లు స్టంట్లు వేశారని గొంతు చికిత్స కూడా జరిగిందని ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని న్యాయమూర్తికి చెప్పుకున్నారు.  తాను తప్పు చేసినట్టు తేలితే నరికేయాలని కోరారు. రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాన్నారు.

పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో ఆయన అరెస్ట్‌ చేశారు. అప్పట్నుంచి  రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లకు తిరుగుతూనే ఉన్నారు. పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోద అయి ఉన్నందున ఆయనను  ఏ జిల్లా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌‌తో  అదుపులోకి తీసుకుంటారా లేకపోతే విడుదలవుతారా అన్న ఉత్కంఠ ఏర్పడింది.  ఏ పోలీస్ స్టేషన్ నుంచీ ఎవరూ పీటీ వారంట్ తో రాకపోతే శనివారం ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com