26.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

మరో మైలురాయి…100వ ప్రయోగానికి ముహూర్తం

ఇస్రో మరో చరిత్ర సృష్టించించేందుకు రంగం సిద్ధమైంది. షార్ నుంచి ఈ నెల 29న ఉదయం 6:23 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది GSLV-F15 రాకెట్. ఇది ఇస్రోకు 100వ రాకెట్ ప్రయోగం. ఈసారి GSLV రాకెట్‌ను నింగిలోకి పంపనుంది ఇస్రో.

GPSలాగా.. భారత్‌కు ప్రత్యకమైన నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించిన శాటిలైట్లను నింగిలోకి పంపుతుంది ఇస్రో. ఇప్పుడు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ల సిరీస్‌లో భాగంగా NVS-02 శాటిలైట్‌ను నింగిలోకి పంపనుంది.

ఇప్పటికే GSLV రాకెట్ అనుసంధాన ప్రక్రయి ముగిసింది. శాటిలైట్‌ను కూడా రాకెట్ పైభాగంలో చేర్చేశారు. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తే మన దేశ నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగు కానుంది. మొత్తం 1500 కిలోమీటర్ల వరకు భారత భూభాగం వెలుపల కూడా మెరుగైన సమాచారం లభించనుంది. విమానాు, నౌకా మార్గాలతో పాటు మన దేశ ఆర్మీ అవసరాలు కూడా తీరుతాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com