అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం నేరేడుగొండ జి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, సభ్యులు మాజీ మంత్రులు జోగు రామన్న,సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటి రెడ్డి, యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజీ రెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన నేతలు పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆత్మహత్య చేసుకున్న యువ రైతు ఆడే గజానంద్ (34 )కు భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మూడెకరాల సొంత భూమితో పాటు, ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఈ రైతు వ్యవసాయం చేస్తున్నాడు. అప్పులు తాళలేక ఇటీవల యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.