30.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

పంత్.. పంజాబ్‌ అంటే ఎందుకు భయపడ్డాడు?

రిషబ్ పంత్.. ఐపీఎల్ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్. లక్నో సూపర్ జెయింట్స్ అతడి కోసం ఏకంగా రూ.27 కోట్లు చెల్లించి మరీ దక్కించుకుంది. ఇప్పుడు అంతా ఊహించినట్టే పంత్‌ను లక్నో కెప్టెన్‌గా ప్రకటించారు ఆ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా. అయితే ఈ సందర్భంగా పంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తనను వేలంగా పంజాబ్ ఎక్కడ కొనుగోలు చేస్తుందో అని భయపడ్డాను అన్నాడు. దీంతో పంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

వేలం రోజు కాస్త టెన్షన్ పడ్డానన్నాడు పంత్. ఆ టెన్షన్‌కు కారణంగా పంజాబ్ కింగ్స్. ఎందుకంటే అప్పటికే శ్రేయస్‌ అయ్యర్‌ను పంజాబ్ దక్కించుకుంది. కానీ వాళ్ల పర్స్‌లో ఇంకా ఎక్కువగా డబ్బులు ఉండటంతో తనను కూడా కొనుగోలు చేస్తారనే భయం ఉండేదట ఆయనలో. ఎందుకంటే పాంటింగ్ తన కోసం వేలంలో పోటీ పడేలా చేసే చాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేశాడట పంత్. కానీ తనను లక్నో తీసుకుంటుందన్న నమ్మకం ఉందని.. అదే చివరికి నిజమైందని చెబుతున్నాడు.

అయితే సంజీవ్ గోయెంకా వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే గోయెంకా గత కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడదే పరిస్థితి మీకు ఎదురైతే ? అనే ప్రశ్నను ఇన్‌డైరెక్ట్‌గా ఎదుర్కొన్నాడు పంత్. సంజీవ్ గోయెంకా ఆందోళన చెందనంత కాలం నాకు ఎలాంటి సమస్య లేదంటూ చెప్పేశాడు పంత్. మరి గోయెంకాను పంత్ సాటిస్‌ఫై చేయగలడా? లేదా? అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com