28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

అమెరికా కాల్పుల్లో హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో ఒ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌ చైతన్యపురికి చెందిన యువకుడు మృతి చెందారు. చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్‌హిల్స్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌ 2లో నివాసం ఉండే కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ అమెరికాలో నివాసం ఉంటున్నాడు. 2022లో అమెరికా వెళ్ళిన రవితేజ మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అయితే రవితేజపై వాషింగ్టన్‌ ఏవ్‌ ప్రాంతంలో ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో రవితేజ మృతి చెందారు. అతని పార్థివదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బంధవులు తెలిపారు. తమ కుమారుడు చదువుకోవడానికి వెళ్ళి అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందడంపై అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంధువు, మిత్రులు గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని చంద్రమౌళి నివాసానికి చేరుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్కే పురం గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని  రవితేజ నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో రవితేజ మృతికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com