36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

సైఫ్‌ పై కసిగా ఆరు కత్తి పోట్లు… కరీనా

  • ఘటన జరిగి మూడు రోజులవుతున్నా దొరకని క్లూ
  • ముంబైలో దర్యాప్తు బృందాల సంఖ్య పెంపు
  • నా ఆటో ఎక్కినది బాలీవుడ్ హీరో అని తెలీదు… ఆటో డ్రైవర్‌

సైఫ్‌ ఆలీఖాన్‌ ను కత్తితో పొడిచిన నిందితుడు దాడి సమయంలో చాలా అగ్రెసివ్‌ గా కనిపించాడంటున్నరు సైఫ్‌ భార్య కరీనా కపూర్. సైఫ్‌ ను పదేపదే కత్తితో పొడిచాడని, అయితే ఆ సమయంలో సైఫ్‌ ను రక్షించుకోవాలన్న తపన తప్ప తమకు మరేం లేకపోయిందని ఆమె అన్నారు. ఘటన జరిగిన వెంటనే ఆగంతకుడు పారిపోయాడని, వెంట ఏ విలువైన వస్తువూ తీసుకెళ్లలేదని ఆమె అంటున్నారు. సైఫ్‌ తన పిల్లలైన తైమూర్‌, జెహంగీర్‌ లను రక్షించుకోడానికి తాపత్రయపడ్డాడని, ఎప్పుడైతే జెహంగీర్‌ ను ఆగంతకుడు చేరుకోలేకపోయాడో ఆ అక్కసుతో సైఫ్ ను మరీ దారుణంగా పొడిచాడని కరీనా అన్నారు. జరిగిన దారుణం చూసి తను నివ్వెరపోయి, భయపడిపోయినట్లు, తన అక్క కరిష్మా వచ్చి తనను ఆమె ఇంటికి తీసుకువెళ్లిందని కరీనాకపూర్‌ వెల్లడించారు. దాదాపు అరగంట పాటూ ఆగంతకుడు సైఫ్‌తో ఘర్షణ పడి పెనుగులాడినట్లు కరీనా పోలీసులకు ఇచ్చిన స్టేట్‌ మెంట్ లో తెలిపారు. ఆ భవనం ఆనుపానులు బాగా తెలిసిన వ్యక్తే కావడంతో సమీపంలోని మరో భవనం నుంచి సైఫ్‌ వాళ్ల భవనంలోకి ప్రవేశించి మెట్ల మార్గం ద్వారా సైఫ్‌ ఆలీఖాన్‌ పిల్లల బెడ్‌రూమ్‌ దగ్గరకు చేరుకున్నాడని తెలుస్తోంది.

నిందితుని కోసం కొనసాగుతున్న వేట

ఈ కేసులో ఇప్పటి వరకూ 30 మంది స్టేట్‌ మెంట్లు రికార్డు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మూడు రోజుల క్రితం సైఫ్‌ ఆలీఖాన్‌ ఇంట్లో దోపిడీకి ప్రయత్నించి పారిపోయిన ఆ దుండగుడు అదే రోజు ఉదయం 9గంటలకు దాదర్‌ లోని ఓ సెల్ ఫోన్ల షాపులో హెడ్‌ ఫోన్స్ కొంటూ సీసీటీవీల కంట బడ్డాడు. ఆ తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్‌ లో దుస్తులు మార్చి బ్లూ టీ షర్టులో కనిపించాడు. దొంగతనం ప్రయత్నం విఫలం కావడంతో లాఘవంగా అక్కడ నుంచి తప్పించుకుని మెట్రోలో పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు నల్లగా, సన్నగా ఉన్నాడని ఐదడుగులా, ఐదు అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు సైఫ్‌ ఇంట్లో చోరీ ఘటనకు ప్రయత్నించిన నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ముంబై పోలీసులు ఇప్పటికే 30 టీములను రంగంలోకి దింపారు. పోలీస్ రికార్డుల్లో ఉన్నవారిని, రాత్రిపూట ఆవారాగా ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే వారిని పోలీసులు ఆరా తీస్తున్నారు.

నా ఆటోలో ప్రయాణించినది సైఫ్‌ అని తెలీదు… ఆటో డ్రైవర్

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ ఆలీఖానే తన ఆటొలో ప్రయాణించినట్లు తనకు చాలా ఆలస్యంగా తెలిసిందంటున్నారు సదరు ఆటో డ్రైవర్‌. ఘటన జరిగిన వేళ అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో తాను ఆటో తీసుకు వెళుతుండగా ఒక బంగ్లా ముందున్న ఓ లేడీ ఆటో..ఆటో అని పెద్దగా అరిచిందని, తీరా దగ్గరకు వచ్చేసరికి రక్తమోడుతున్న దుస్తులతో ఓ వ్యక్తి ఆదరాబాదరాగా ఆటోలో ఎక్క కూర్చున్నారని ఆ డ్రైవర్ గుర్తు చేసుకున్నాడు. మొదట ఆటో ఎక్కించుకునేందుకు భయపడ్డానని, లేనిపోని కేసుల్లో ఇరుక్కోడం ఎందుకని అనుకుంటుండగానే వారు బలవంతంగా ఆటో ఎక్కి కూర్చున్నారని .. అంతలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లు అని గాయపడిన వ్యక్తి కమాండింగ్‌ గా చెప్పాడని డ్రైవర్‌ తెలిపాడు. అప్పటికీ తన ఆటో ఎక్కినది సైఫ్‌ అని తెలీలేదని, ఆస్పత్రికి చేరుకున్నాక ఆస్పత్రి ముందు సిద్ధంగా ఉన్న సిబ్బంది సాబ్‌ సాబ్‌ అంటూ సైఫ్‌ ను గబగబా దింపి తీసుకెళ్లడం చూసి అవాక్కయ్యానని డ్రైవర్‌ అన్నాడు. అప్పుడు ఎవరా వ్యక్తి అని అడగగా సైఫ్‌ ఆలీఖాన్‌ అని చెప్పారని ఆ ఆటో డ్రైవర్‌ ఆరోజు ఘటనను గుర్తు చేసుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com