36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

ఒక్క డిన్నర్.. అన్ని ప్రచారాలు బంద్

ఒక్క ఫోటో.. నాలుగు లైన్ల క్యాప్షన్. అంతే ఇప్పటి వరకు జరిగిన ప్రచారాలు, వండి వార్చిన కథనాలకు చెక్ పడిపోయింది. ఇన్నాళ్ల పాటు అదట.. ఇదట.. అంటూ ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ ఒక్క ఫోటోతో వీటన్నింటికి చెక్ పెట్టారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.

ఇంతకీ విషయమేంటి అంటే బరాక్ ఒబామా.. ఆయన భార్య మిచెల్ ఒబామా మధ్య వివాదాలు జరుగుతున్నాయి. వారు త్వరలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అందుకే కలిసి ఈవెంట్లకు కూడా హాజరవ్వడం లేదు అని. వీటికి బలం చేకూర్చేలా కొన్ని ఘటనలు జరిగాయి. ఇటీవల మృతి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ అంత్యక్రియలకు మిచెల్ హాజరు కాలేదు. ట్రంప్‌ ప్రమాణస్వీకారోత్సవానికి ఆమె రావడం లేదని తెలుస్తోంది. దీంతో వారిద్దరు విడిపోతున్నారన్న ప్రచారం మరింత పెరిగింది.

నిజానికి వీరిద్దరికి ఎంతో అన్యోన్యంగా ఉంటారని పేరుంది. అంతేకాదు పాపులర్ కపుల్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారి మధ్య విడాకులు అనే వార్తలు కనిపించగానే ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. వీటన్నింటికి ఓ పోస్ట్‌తో సమాధానం చెప్పేశారు ఒబామా. మిచెల్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ.. వారిద్దరు కలిసి చేసిన డిన్నర్‌ పిక్‌ను ట్యాగ్ చేశారు. నా జీవితాన్ని ప్రేమ‌తో నింపిన నా ప్రేయసి మిచెల్ ఒబామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలోని ప్రతి రోజునీ మంచి జ్ఞాపకంగా నింపావు.. నీతో కలిసి జీవితంలో సాహ‌సాలు చేయ‌డంలో భాగ‌మైనందుకు నేను అదృష్టవంతుడిని అంటూ బ‌రాక్ ఒబామా రాసుకొచ్చాడు.

ఈ ఒక్క పోస్ట్‌తో ప్రచారాలన్నింటికి చెక్ పెట్టినట్టైంది. మిచెల్‌ టీమ్ కూడా ఇప్పటికే ఈ వార్తలన్ని ఫేక్ అంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. బ‌రాక్ ఒబామా మిచెల్‌కు 1992లో పెళ్లి జరిగింది. వీరికి సాషా, మలియా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com